Modi Painting : అసోం క‌ళాకారుడి ప్ర‌తిభ‌కు మోదీ ఫిదా

ప్ర‌త్యేకంగా అభినందించిన ప్ర‌ధాన మంత్రి

Modi Painting : భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) ప్ర‌తిభ‌ను గుర్తించ‌డం, ప్రోత్స‌హించ‌డంలో ఎల్ల‌ప్పుడూ ముందుంటారు. ఎవ‌రైనా స‌రే క‌ష్ట‌ప‌డితే గెలుపు సాధ్య‌మ‌వుతుంద‌ని అంటారు.

అందుకే ప్ర‌తి నెలా నిర్వ‌హించే మ‌న్ కీ బాత్ రేడియో కార్య‌క్ర‌మంలో సామాన్యులు అసాధార‌ణ విజేత‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ ఉంటారు. తాజాగా అసోంకు చెందిన క‌ళాకారుడి ప్ర‌తిభ‌ను మెచ్చుకున్నారు ప్ర‌ధాని మోదీ.

ఈ సంద‌ర్భంగా దివ్యాంగ క‌ళాకారుడు పెయింటింగ్ ను క‌ష్ట‌ప‌డి గీశాడు. త‌న క‌ల ఒక్క‌టే మోదీని క‌ల‌వాల‌ని, తాను గీసిన చిత్రాన్ని ఇవ్వాల‌ని.

దీనిని సాకారం చేసేలా ప్ర‌య‌త్నం చేశారు అసోం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ‌. అస్సాంలోని సిల్చార్ జిల్లాకు చెందిన క‌ళాకారుడు అభిజిత్ గోటాని. సీఎం సాయంతో పీఎంను ఇవాళ క‌లిశారు.

గోటాని సంకేత భాష‌లో మీడియాతో మాట్లాడాడు. అత‌ని త‌ల్లి బిడ్డ మాట‌ల్ని అనువాదం చేసింది. గోటాని గీసిన చిత్రం మోదీని(Modi Painting) ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. త‌న హృద‌యాన్ని క‌దిలించింద‌ని ఈ సంద‌ర్భంగా మోదీ పేర్కొనడం విశేషం.

నేను ప్ర‌తిరోజూ టీవీలో ప్ర‌ధానిని చూస్తాను. చివ‌ర‌కు ద‌గ్గ‌రుండి చూడాల‌ని అన్న‌ది నా క‌ల‌. నా క‌ల ఇవాల్టితో సాకార‌మైంది. నా జ‌న్మ ధ‌న్య‌మైంద‌ని పేర్కొన్నాడు గిటానీ.

అత‌డికి ఇప్పుడు 28 ఏళ్లు. ఈ పెయింటింగ్ లో ప్ర‌ధాని మోదీ త‌న త‌ల్లితో క‌లిసి ఐక్య రాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో మాట్లాడుతున్న పీఎం దేశానికి అధినేత కావ‌డం వ‌ర‌కు ఇందులో గీశాడు.

గోటాని పుట్టుక‌తో చెవిటి, మూగ కూడా. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని గోటానిని వెన్ను త‌ట్టడం మ‌రిచి పోలేమ‌న్నారు త‌ల్లి.

Also Read : అంబానీకి అభ‌యం భ‌ద్ర‌త క‌ట్టుదిట్టం

Leave A Reply

Your Email Id will not be published!