Modi : మోదీకి జ‌పాన్ చిన్నారుల గ్రీటింగ్స్

సంతోషానికి లోనైన ప్ర‌ధాన మంత్రి

Modi : భార‌త దేశంలో ఓ వైపు హిందీని ప్ర‌ధాన భాష‌గా చేయాల‌ని సంక‌ల్పించిన కేంద్రంలోని ప్ర‌ధాన మంత్రి మోదీకి ఆయా రాష్ట్రాల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదురైంది.

కానీ ఆయ‌న‌కు ఊహించ‌ని రీతిలో జపాన్ కు చెందిన చిన్నారులు హిందీలో స్వాగ‌తం ప‌లికారు. దీంతో తీవ్ర సంతోషానికి, ఆనందానికి లోన‌య్యారు ప్ర‌ధాన మంత్రి. ఈ సంద‌ర్భంగా పిల్ల‌ల‌ను ఆయ‌న ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు.

న‌రేంద్ర మోదీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం జ‌పాన్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా అక్క‌డికి చేరుకున్న ప్ర‌ధానికి జ‌పాన్ కు చెందిన చిన్నారులు మోదీజీ ఆప్ కా స్వాగ‌త్ అంటూ ఆహ్వానం ప‌లికారు.

మోదీ(Modi) విస్తు పోయారు. చిన్నారులు మీరు ఎక్క‌డ నేర్చుకున్నారు హిందీని అంటూ అడిగారు. హిందీలో గ్రీటింగ్స్ తెలియ చేసిన వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఈ సంఘ‌ట‌న టోక్యోలో చోటు చేసుకుంది. అక్క‌డ ఉంటున్న భార‌తీయులు ప్ర‌ధానికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జ‌పాన్ కు స్వాగ‌తం. ద‌య‌చేసి మీ సంత‌కం నా వ‌ద్ద ఉండ‌వ‌చ్చా అంటూ రిత్సుకీ కొబ‌యాషి అనే చిన్నారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని హిందీలో ప్ర‌శ్నించారు.

అత‌డి ప‌టిమ‌కు ముగ్ధుడ‌య్యారు మోదీ. వాహ్ మీరు ఈ భాష‌ను ఎక్క‌డి నుంచి నేర్చుకున్నారంటూ అడిగారు. ఇది మీకు తెలుసా అని అన్నారు. నేను ఎక్కువ‌గా మాట్లాడ‌లేను.

కానీ నా భాష‌ను ప్ర‌ధాని మోదీ అర్థం చేసుకున్నారు. సంతోషంగా ఉంద‌న్నాడు చిన్నారి రిత్సుకీ కొబ‌యాషి. పిల్ల‌లంతా సాంప్రదాయ దుస్తులు ధ‌రించి స్వాగ‌తం ప‌లికారు మోదీకి(Modi).

Also Read : వీధుల్లో నమాజ్ బంద్ – యోగి

Leave A Reply

Your Email Id will not be published!