PM Modi XI Jinping : జిన్ పింగ్ తో విందుకు మోదీ దూరం
ఇరు దేశాల మధ్య పెరిగిన అంతరం
PM Modi XI Jinping : భారత్ , చైనా దేశాల మధ్య మరింత దూరం పెరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు.
కానీ వీరిద్దరూ సంప్రదాయకంగా ఏర్పాటు చేసిన విందుకు మాత్రం హాజరు కాలేదు. ఇది చర్చనీయాంశంగా మారింది. సమర్ కండ్ లో ఉన్నా వీరు కలుసుకోలేదు.
అనధికారిక విందుతో సహా గ్రూప్ ఈవెంట్ లను కూడా దాట వేశారు మోదీ, జిన్ పింగ్(PM Modi XI Jinping). అంతకు ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో కలిసి ప్రత్యేకంగా చెట్లను నాటారు.
ఇదే సమయంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) కీలక సమావేశంలో పాల్గొనేందుకు రష్యా, భారత్, చైనా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ దేశాలు పాల్గొంటున్నాయి.
భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. అంతకు ముందు మోదీ ఇతర దేశాధినేతలతో కీలకమైన చర్చలు జరుపుతారని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
చివరి వరకు చైనా చీఫ్ జిన్ పింగ్(XI Jinping) తో కూడా విందు, కీలక భేటీ జరుగుతుందని అంతా భావించారు. కానీ ఆఖరు నిమిషంలో వీరిద్దరూ ఒకే వేదికలో హాజరయ్యేందుకు చేరుకున్నా ముఖాముఖి సంభాషణలకు కూడా ప్రయారిటీ ఇవ్వలేదు.
ఇప్పటికే భారత, చైనా దేశాల సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు చైనా శ్రీలంక, పాకిస్తాన్ లను అడ్డం పెట్టుకుని భారత్ ను లక్ష్యంగా చేసుకుంది.
దీనిని తీవ్రంగా పరిణిస్తోంది భారత్. ఇదే క్రమంలో జిన్ పింగ్ తో భేటీ కాక పోవడం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది.
Also Read : పుతిన్ తో పీఎం మోదీ కీలక భేటీ