MLC Kavitha Modi : మోదీ మ‌మ్మ‌ల్ని ఏమీ చేయ‌లేరు – క‌విత

తెలంగాణ‌కు ఇచ్చింది ఏమీ లేదు

MLC Kavitha Modi : ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప‌ర్య‌టించిన మోదీ వ‌ల్ల ఒరిగింది ఏమీ లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌ధాని ఒట్టి చేతుల‌తో వ‌చ్చారు. చివ‌ర‌కు సొల్లు క‌బుర్లు చెప్పారు. ఆపై వెనుదిరిగి వెళ్లి పోయార‌ని ఎద్దేవా చేశారు.

ప్ర‌ధాన మంత్రికి అంత సీన్ లేద‌న్నారు క‌విత‌. విలువ‌లేని ప్ర‌క‌ట‌న‌లు, ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇవ్వ‌డం త‌ప్ప తెలంగాణ‌కు ఏం చేశారో చెప్పాల‌ని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. త‌మ ప్ర‌భుత్వం ప‌ట్ల కక్ష సాధింపు ధోర‌ణికి కేంద్రం శ్రీ‌కారం చుట్టింద‌ని దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు క‌విత‌.

ఒక ర‌కంగా మోదీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంకెంత కాలం తెలంగాణ వాసుల‌ను మ‌భ్య పెడ‌తార‌ని ప్ర‌శ్నించారు. పొద్ద‌స్త‌మానం త‌మ‌పై ఆడి పోసుకోవ‌డ‌మే త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు ఏమైనా చేశారా అని నిల‌దీశారు.

మ‌మ్మ‌ల్ని ఏమీ చేయ‌లేర‌ని హెచ్చ‌రించారు. త‌మ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌కు ఒక్క స‌మాధానం ఇవ్వ‌లేక పోయార‌ని మండిప‌డ్డారు క‌విత‌(MLC Kavitha).

అంత‌కు ముందు ప్ర‌ధాన మంత్రి రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల‌లో ప‌ర్య‌టించారు. ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. మ‌రికొన్నింటిని ప్రారంభించారు ప్ర‌ధాన‌మంత్రి. ఇదే స‌మ‌యంలో రామ‌గుండంను ప్రైవ‌టీక‌ర‌ణ చేయ‌బోమంటూ ప్ర‌క‌టించారు మోదీ.

అంత‌కు ముందు టీఆర్ఎస్ మోదీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టింది. ఎమ్మెల్సీ చేసిన కామెంట్స్ పై బీజేపీ నాయ‌కులు క‌న్నెర్ర చేశారు.

Also Read : మోదీ వార్నింగ్ దేనికి సంకేతం

Leave A Reply

Your Email Id will not be published!