Modi Shinzo Abe : ప్రధాని భావోద్వేగం రేపు సంతాప దినం
నిర్ణయంచిన భారత ప్రభుత్వం
Modi Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ప్రచారం చేస్తున్న సమయలో కాల్పులకు పాల్పడడంతో తీవ్ర రక్తస్రావంతో ఉన్న ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు జపాన్ దేశ ప్రభుత్వం ప్రకటించింది. షింజో అబే మరణ వార్తతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయైంది.
ఆయనతో అనుబంధం కలిగిన ప్రతి ఒక్కరూ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జపాన్ దేశానికి సుదీర్ఘ కాలం పాటు ప్రధాన మంత్రిగా పని చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర కనబరిచేలా ప్రయత్నం చేశారు షింజో అబే(Modi Shinzo Abe).
తన కాలంలో ఎక్కువగా భారత దేశంతో సత్ సంబంధాలు ఉండేలా చూసుకున్నారు. దీంతో భారత ప్రభుత్వం షింజో అబేను జాతి అత్యున్నతంగా భావించే పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించి సత్కరించింది.
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర బాధను వ్యక్తం చేశారు. తాను ఒక సోదరుడిని , ఆత్మీయుడిని కోల్పోయానని పేర్కొన్నారు.
ఆయనకు నివాళిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంతాప సూచకంగా శనివారం జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేకు(Modi Shinzo Abe) నివాళిగా ఒక్క రోజు సంతాప దినం పాటించాలని నిర్ణయించింది.
ఇదిలా ఉండగా ట్విట్టర్ వేదికగా మోదీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. టోక్యోలో నా ప్రియ మిత్రుడిని చివరిసారిగా కలుసుకున్నా. దీనిని మరిచి పోలేక పోతున్నానని పేర్కొన్నారు.
Also Read : కాల్పుల కలకలం ప్రపంచం విస్మయం