Agnipath Protest : అగ్నిప‌థ్ అగ్నిగుండం కేంద్రం అప్ర‌మ‌త్తం

సంమ‌య‌మ‌నం పాటించాల‌ని కోరిన అమిత్ షా

Agnipath Protest : మోదీ స‌ర్కార్ ప్ర‌క‌టించిన అగ్నిప‌థ్ రిక్రూట్ మెంట్ స్కీం(Agnipath Protest) దేశ వ్యాప్తంగా మంట‌లు రాజేసింది. ఎక్క‌డ చూసినా నిర‌స‌న‌లే. ఆందోన‌ల‌తో అట్టుడుకుతోంది దేశం. ఆందోళ‌న‌కారులు రైళ్లు, బ‌స్సుల‌ను టార్గెట్ చేసుకున్నారు.

సాయుధ ద‌ళాల‌లో కేవ‌లం నాలుగు సంవ‌త్స‌రాల కాల ప‌రిమితికి మాత్ర‌మే భ‌ర్తీ చేస్తామ‌ని చేసిన ప్ర‌క‌ట‌న ఒక్క‌సారిగా అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మైంది. నిరుద్యోగ భార‌తం భగ్గుమంది. పీఎం మోదీపై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు.

క‌రోనా సాకుతో ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌కుండా ఇబ్బందికి గురి చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక అగ్ని ప‌థ్ స్కీం కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి.

బీహార్ లో మొద‌లైన ఈ ఆగ్ర‌హం ఇప్పుడు దేశా వ్యాప్తంగా అంటుకునేలా చేశాయి. నిన్న‌, మొన్న శాంతియుతంగా జ‌రిగినా శుక్ర‌వారం మాత్రం ఆందోళ‌న‌లు ఉద్రిక్త‌త‌కు దారి తీశాయి.

బీహార్, ఉత్త‌ర ప్ర‌దేశ్, హ‌ర్యానా, మ‌ధ్య ప్ర‌దేశ్ , తెలంగాణ‌, ఇలా ప్ర‌తి చోట నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ పూర్తిగా ధ్వంసానికి గురైంది.

వేలాది మంది మూకుమ్మ‌డిగా దాడికి పాల్ప‌డ్డారు, రైళ్ల‌ను త‌గుల బెట్టారు. రాళ్లు రువ్వారు. బ‌స్సుల‌ను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.

ఇందులో ఇద్ద‌రు చ‌ని పోయిన‌ట్లు స‌మాచారం. 8 మందికి గాయాలైన‌ట్లు తెలిసంది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేష‌న్ ల‌లో భ‌ద్ర‌త‌ను పెంచాల‌ని ఆదేశించింది.

ఇదిలా ఉండ‌గా బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం విధ్వంసానికి పాల్ప‌డ్డారంటూ ఆరోపించాచ‌రు.

Also Read : సోనియా గాంధీ ఆరోగ్యం ప‌దిలం

Leave A Reply

Your Email Id will not be published!