Modi Govt Issues : కేంద్రం కీల‌క నిర్ణ‌యం

సోష‌ల్ మీడియా పోస్టుల‌పై కేసులుండ‌వు

Modi Govt Issues : న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ(BJP) సంకీర్ణ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సామాజిక మాధ్య‌మాల‌లో పోస్టులు చేసే వారికి తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు పోస్టులు చేసే వారికి ఊర‌ట‌ను క‌లిగించేలా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఈ మేర‌కు శుక్ర‌వారం ఇందుకు సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. సోష‌ల్ మీడియా పోస్టుల‌పై అరెస్ట్ లు, శిక్ష‌లు అంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఎలాంటి ఎఫ్ఐఆర్ లు కూడా న‌మోదు చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది.

Modi Govt Issues Sensational Decision

ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల‌లో చేసిన పోస్టుల‌కు సంబంధించి ఏమైనా కేసులు న‌మోదు చేసినా లేక అరెస్ట్ ల‌కు పాల్ప‌డినా చెల్లుబాటు కావ‌ని వెంట‌నే వాటిని ఉప‌సంహ‌రించు కోవాల‌ని తెలిపింది కేంద్రం.

ఒక‌వేళ కేసులు గ‌నుక న‌మోదు చేస్తే వెంట‌నే తొల‌గించాల‌ని స్ప‌ష్టం చేసింది కేంద్రం. అంతే కాకుండా పోలీసులు గ‌నుక అతి ఉత్సాహం ప్ర‌ద‌ర్శించినా లేదా కేసులు పెట్టి వేధింపుల‌కు గురి చేస్తున్న‌ట్ల‌యితే ఈ ఆర్డ‌ర్ కాపీతో కోర్టుల‌ను ఆశ్ర‌యించ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలు కుదురుతుంద‌ని పేర్కొంది.

Also Read : CPI Narayana : టీటీడీ నిధుల‌పై బీజేపీ రాద్దాంతం

Leave A Reply

Your Email Id will not be published!