Modi Education Policy : కొత్త విద్యా విధానానికి ప‌చ్చ జెండా

కేంద్ర స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Modi Education Policy  : కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎప్ప‌టి నుంచో తాను అనుకుంటూ వ‌స్తున్న దానిని అమ‌లు చేసేందుకు రెడీ అయ్యింది. మోదీ ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరాక భార‌త రాజ్యాంగానికి తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

విద్యా వ్య‌వ‌స్థ‌లో (Modi Education Policy )మార్పులు తీసుకు రావాల‌న్న దానిపై ఎక్కువ ఫోక‌స్ పెట్టారు. తాజాగా జెఎన్ యూ యూనివ‌ర్శిటీకి కాషాయ భావ‌జాలం క‌లిగిన వ్య‌క్తిని వీసీగా నియ‌మించింది కేంద్రం. 36 ఏళ్ల త‌ర్వాత విద్యా విధానంలో మార్పు చేసింది.

విద్యార్థుల స‌ర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసేలా నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి 5+3+3+4 విధానంలో టీచింగ్ జ‌ర‌గ‌నుంది. స్టూడెంట్స్ వ‌య‌సు ఆధారంగా ఫండ‌మెంట‌ల్ , ప్రిప‌రేట‌రీ, మిడిల్ , సెకండ‌రీ కోర్సుల‌ను బోధించ‌నుంది.

ఇందులో ప్ర‌ధానంగా కో క‌రికుల‌ర్ కార్య‌క్ర‌మాల‌కు ప్రాధానం ఇచ్చేలా సిల‌బ‌స్ రూపొందిస్తారు. 6వ త‌ర‌గ‌తి నుంచే ఒకేష‌న‌ల్ విధానం అమ‌లులోకి రానుంది. కేంద్రం ఆలోచ‌న ప్ర‌కారం చూస్తే 4 నుంచి 8 ఏళ్ల లోపు స్టూడెంట్స్ కు ఫండ‌మెంట‌ల్ కోర్సు అందిస్తారు.

ఐదేళ్ల కాల ప‌రిమితి ఉంటుంది కోర్సు. మొద‌టి మూడు సంవ‌త్స‌రాలు ప్రీ ఎడ్యూకేష‌న్ ఉంటుంది. ఆ త‌ర్వాత ఒక‌టి, రెండో త‌ర‌గ‌తులు బోధిస్తారు. మ‌రో వైపు 8 నుంచి 11 ఏళ్ల చిన్నారుల కోసం ప్రిప‌రేట‌రీ కోర్సు ఉంటుంది.

3, 4, 5 క్లాసుల‌కు సంబంధించి నిర్దేశించిన సిల‌బ‌స్ బోదిస్తారు. మిడిల్ స్కూల్ బోధ‌న మూడేళ్లు ఉంటుంది. 11 నుంచి 14 ఏళ్ల స్టూడెంట్స్ కు 6, 7, 8 క్లాసుల‌కు టీచింగ్ చేస్తారు.

ఆరు నుంచి నైపుణ్యాభివృద్ధి కోర్సులు ఉంటాయి. 15 నుంచి 18 ఏళ్ల విద్యార్థుల‌కు 9 నుంచి 12 దాకా క్లాసులు ఉంటాయి.

Also Read : మ‌హిళా వ‌ర్శిటీగా కోఠీ ఉమెన్స్ కాలేజ్

Leave A Reply

Your Email Id will not be published!