Medaram Jatara : ప్రపంచంలోనే అతి పెద్ద జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో (Medaram Jatara)వసతి సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేసింది కేంద్రం. ఈ మేరకు రూ. 2.50 కొట్లు విడుదల చేసింది.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ , పర్యాటక మంత్రిత్వ శాఖల ద్వారా ఈ నిధులు కేటాయించింది. ఈ నిధులను కాంపౌండ్ వాల్ , 900 మీటర్ల మెష్ ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు గోడలపై గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా చిత్రాలను వేస్తారు.
గిరిజన మ్యూజియంను ఆధునీకరిస్తారు. ఇందులో డిజిటల్ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. గిరిజన మ్యూజియం పరిసరాల్లో కోయ గ్రామాన్ని ప్రతిబింబించే నిర్మాణాల కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.
కేంద్ర సర్కార్ గిరిజనుల ప్రత్యేక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా కృషి చేసేందుకు ఫోకస్ పెట్టింది. 2014 నుంచి ఇప్పటి దాకా తెలంగాణలో జరుపుకునే పండుగలకు డీపీపీహెచ్ పథకం కింద రూ. 2.45 కోట్లు విడుదల చేసింది కేంద్రం.
గిరిజన సర్క్యూట్ల అభివృద్ధిలో భాగంగా 2016-17 లో రూ. 80 కోట్లతో ములుగు- లక్నవరం- మేడారం – తాడ్వాయి – దామ రవి- మల్లూరు- బొగత తదితర జలపాతాల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు.
త్వరలో భారీ ఎత్తున జరగబోయే మేడారం జాతర కోసం గెస్ట్ హౌస్ , ఓపెన్ ఆడిటోరియం, పర్యాటకుల కసోం విడిది గృహాలు, సోలార్ లైట్లు, తాగు నీటి సౌకర్యాలు కల్పించారు.
అంతే కాకుండా రామ్ జీ గోండు గిరిజన మ్యూజియం, ఏపీలో నిర్మిస్తున్న అల్లూరి మ్యూజియం నిర్మాణాల కోసం రూ. 15 కోట్ల చొప్పున రిలీజ్ చేశారు.
Also Read : ప్రేమను పంచండి సేవ చేయండి