Amnesty International : ప్రశ్నించే గొంతులపై మోదీ ఉక్కుపాదం
సంచలన ఆరోపణలు చేసిన అమ్నెస్టీ
Amnesty International : అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్(Amnesty International) సంచలన కామెంట్స్ చేసింది. భారత దేశంలో ప్రశ్నించే గొంతుల్ని తొక్కి పెట్టేందుకు మోదీ బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందంటూ ఆరోపించింది.
ప్రధానంగా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీ, సీబీఐ, ఐఎన్ఏ, తదితర సంస్థలను విరివిగా ప్రయోగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశంలో హక్కులు, పర్యావరణం, పేదరిక నిర్మూలన, అక్షరాస్యత, మహిళా సాధికారత, వ్యవసాయం, తదితర రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్న స్వచ్చంధ సంస్థలను టార్గెట్ చేయడం మంచి పద్దతి కాదని సూచించింది అమ్నెస్టీ.
ఇటీవల కావాలని కొన్ని సంస్థలపై ఐటీ దాడులకు దింపారని (IT Raids) ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించింది. వెంటనే ఈ దాడులను నిలిపి వేయాలని అమ్నెస్టీ కోరింది.
ప్రధానంగా దేశంలో పౌర సంస్థలు పని చేయాలంటేనే జంకే పరిస్థితి నెలకొందని వాపోయింది. వెంటనే ఇలాంటి అణచివేత కుయుక్తులకు తెర దించి పూర్తి పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కును కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఇదిలా ఉండగా పన్ను ఎగవేత, ఎఫ్సీఆర్ఏ రూల్స్ ఉల్లంఘన ఆరోపణలపై ఆదాయ పన్ను విభాగం తాజాగా పెద్ద ఎత్తున దాడులు చేపట్టింది.
సర్వే పేరుతో పలు సంస్థలను టార్గెట్ చేసిందంటూ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ యామినీ మిశ్రా ఆరోపించారు. ప్రతిరోజూ లెక్కకు మించి పౌరులు, సంస్థలపై దాడులు జరగడం బాధాకరమన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా గత ఎనిమిదేళ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘటన కొనసాగుతోందన్నారు.
Also Read : క్వీన్ ఎలిజబెత్ భారత్ కు ట్రూ ఫ్రెండ్