Amartya Sen Modi : మోడీ సర్కార్ డేంజర్ – అమర్త్య సేన్
ప్రపంచ ఆర్థికవేత్త షాకింగ్ కామెంట్స్
Amartya Sen Modi : ప్రపంచ దిగ్గజ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్(Amartya Sen) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అత్యంత ప్రమాదకరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ గనుక మరోసారి పీఎం అయితే దేశాన్ని పూర్తిగా అమ్మకానికి పెడతారంటూ ఆరోపించారు.
ప్రపంచంలోని ప్రభుత్వాల్లో అత్యంత ప్రమాదకరమైన ప్రభుత్వాలలో మోడీ(PM Modi) సర్కార్ ఒకటి అని హెచ్చరించారుఅమర్త్య సేన్ . విచిత్రం ఏమిటంటే పార్లమెంట్ లోని లోక్ సభ , రాజ్య సభలో మైనార్టీ వర్గానికి చెందిన ఒక్కరు కూడా ముస్లిం లేక పోవడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని , అనాగరికమని పేర్కొన్నారు.
భారతీయ సంస్కృతి ప్రస్తుతం అంపశయ్యపై ఉందన్నారు అమర్త్య సేన్. జాతీయ మీడియా ది వైర్ కరణ్ థాపర్ తో మాట్లాడారు. మోడీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఒక రకంగా నిప్పులు చెరిగారు. మైనార్టీలపై ఒక పద్దతి ప్రకారం దాడులకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు. ఇదే సమయంలో హిందూ వాదాన్ని ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోందంటూ సంచలన కామెంట్స్ చేశార అమర్త్య సేన్(Amartya Sen) .
భారత దేశం భిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనమని స్పష్టం చేశారు ఆర్థికవేత్త. ప్రస్తుతం దేశం జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని , ఇది విపరీతమైన పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందన్నారు అమర్త్య సేన్. దేశం గురించి తలుచుకుంటే ఆందోళనకరంగా ఉందన్నారు. ఒక రకంగా తనకు భయం కలుగుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Also Read : కిరన్ రిజిజుపై నారీమన్ ఆగ్రహం