Modi : రామానుజుల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మోదీ

దేశంలో మొద‌టిది ప్ర‌పంచంలో రెండోది

Modi : వెయ్యేళ్ల కింద‌ట ఈ భువిపై న‌డ‌యాడిన మ‌హోన్న‌త మాన‌వుడు శ్రీ రామానుజాచార్యుల భారీ విగ్ర‌హాన్ని దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ఆవిష్క‌రించారు.

హైద‌రాబాద్ లోని ముచ్చింత‌ల్ లో 216 అడుగుల తో ఏర్పాటు చేసిన స‌మ‌తామూర్తిని ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు ప్ర‌ధాని మోదీ(Modi) రుద్రాభిషేక యాగంలో పాల్గొన్నారు.

అనంత‌రం 108 విష్ణు ఆల‌యాల ప్ర‌తిరూపాల‌ను సంద‌ర్శించారు. వాటి వివ‌రాలు, వైశిష్ట‌త‌ను జ‌గత్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానాజ చిన్న‌జీయ‌ర్ స్వామి వివ‌రించారు. ఆయ‌న వెంట కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఉన్నారు.

ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేందుకు 10 ఏళ్ల పాటు ప‌ట్టింది. ఇందు కోసం దాత‌లు, సంస్థ‌లు, అభిమానులు, భ‌క్తులు ఇచ్చిన విరాళాల తో స‌మ‌కూరిన రూ. 1000 కోట్ల‌తో దీనిని నిర్మించారు.

ఈ విగ్ర‌హాన్ని చైనాలో త‌యారు చేశారు. ఈ విగ్ర‌హ నిర్మాణంలో 60 మంది నిపుణులు పాల్గొన్నారు. శ్రీ‌రామ‌న‌గ‌రం, స‌మ‌తా కేంద్రం పూర్తి భ‌క్త కోటి జ‌నంతో నిండి పోయింది.

అంత‌కు ముందు భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌తో బంగారు దుస్తులు ధ‌రించిన ప్ర‌ధాని మోదీ (Modi)ప్రార్థ‌న స్థలం వ‌ద్ద‌కు హాజ‌ర‌య్యారు మోదీ. ఇదిలా ఉండ‌గా స‌ర్వ ప్రాణ‌కోటి అంతా ఒక్క‌టేన‌ని వెయ్యేళ్ల కింద‌ట శ్రీ రామానుజులు చాటారు.

ఆయ‌న అందించిన స్పూర్తి మార్గాన్ని నేటి త‌ర‌మే కాదు భావి త‌రాలకు కూడా అందించే ఉద్దేశంతో ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి.

ఇదిలా ఉండ‌గా సీఎం కేసీఆర్ కు జ్వ‌రం రావ‌డంతో హాజ‌రు కాలేదు.

Also Read : ఆధ్యాత్మిక సిగ‌లో స‌మ‌తా మూర్తి

Leave A Reply

Your Email Id will not be published!