Asaduddin Owaisi : మోదీ .. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ – ఓవైసీ
ప్రధానమంత్రిపై ఎంఐఎం చీఫ్ ఫైర్
Asaduddin Owaisi : గుజరాత్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగి పోయాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ చంద్ర షా, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ , కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సైతం పాల్గొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఎంఐఎం కూడా ఎన్నికల బరిలో తమ లక్ ను పరీక్షించు కునేందుకు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానమంత్రిని, కేంద్ర సర్కార్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు.
మోదీ కేంద్రంలో ఉన్నంత కాలం నిరుద్యోగులకు జాబ్స్ రావని, వయస్సు పోతే తిరిగి రాదని పెళ్లిళ్లు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు ఓవైసీ. గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధానిని టార్గెట్ చేశారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
మాయ మాటలు చెప్పడంలో మోదీ సిద్దహస్తుడని మండిపడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగులు జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కోట్లు భర్తీ చేయలేదు సరికదా కనీసం 10 వేల కొలువులు కూడా భర్తీ చేయలేదని సంచలన ఆరోపణలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ.
ఇదిలా ఉండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక్లో ప్రస్తుతం 14 మంది అభ్యర్థులను ప్రకటించామని వెల్లడించారు.
Also Read : రీజినల్ కోఆర్డినేటర్లు..ప్రెసిడెంట్ల ఎంపిక