S Jai Shankar : మోదీ సంక్షోభ నిర్వహణ సామర్థ్యం అద్భుతం
సుబ్రమణ్యం జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన మొదటి సమావేశాన్ని శుక్రవారం గుర్తు చేసుకున్నారు.
మోదీకి ఉన్న నేర్పరితనం, ముందుచూపు, సంక్షోభ సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఉత్సుకత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు జై శంకర్. సంక్షోభ నిర్వహణను ప్రశంసించారు.
ఆఫ్గనిస్తాన్ లోని మజార్ ఎ షరీఫ్ దాడికి గురైన రాత్రిని గుర్తు చేసుకున్నారు. ఇది భారత కాన్సులేట్ లోని వారి భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.
ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నారు జై శంకర్. ఈ సందర్బంగా పరస్పర చర్యను ప్రత్యేకంగా ప్రస్తావించారు. నరేంద్ర మోదీ నాయకత్వ నైపుణ్యాలను ప్రశంసించారు.
ఒకానొక సమయంలో సమస్యలు, సంఘటనలు అనుకోకుండా వస్తాయన్నారు జై శంకర్. ఈ విపత్కర పరిస్థితుల్లో నిర్ణయాల పర్యవసానాలను నిర్వహించేందుకు ఏకైక గుణంగా అభివర్ణించారు.
మోదీ సంక్షోభ నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు జై శంకర్. నేను ప్రధానమంత్రిని కలిసేందుకు ముందుకు మోదీని కలుసుకున్నానని చెప్పారు.
చాలా మంది ఆయన పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తారు. నిరాధార ఆరోపణలు చేస్తారు. కానీ మోదీని దగ్గరుండి చూస్తే వేరుగా ఉంటుందన్నారు జై శంకర్. ఆయన నాయకత్వ లక్షణాలు అద్బుతమన్నారు కేంద్ర విదేశాంగ మంత్రి(S Jai Shankar).
ప్రధాన మంత్రి ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పనిలో నిమగ్నమై ఉంటారు. ఇది దేశం పట్ల, తన పదవి పట్ల ఉన్న నిబద్దత ఏమిటో తెలియ చేస్తుందన్నారు జై శంకర్. రాజకీయాలను పక్కన పెట్టి జాతీయ విధానానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారన్నారు.
Also Read : యుద్దాన్ని వెంటనే విరమించండి – జై శంకర్