Rahul Gandhi : మోదీ మౌనం దేశానికి ప్ర‌మాదం – రాహుల్

చైనా దూకుడుపై ప్ర‌ధాని మౌనం ఎందుకు

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క అంశాల ప‌ట్ల ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు. చైనా ఓ వైపు అక్ర‌మంగా చొర‌బాటుకు య‌త్నిస్తున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

ఒక ర‌కంగా డ్రాగ‌న్ దేశం పేరు చెబితే ప్ర‌ధాన మంత్రి భ‌య‌ప‌డుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన మోదీ ప‌లాయ‌న‌వాదాన్ని అనుస‌రిస్తుండ‌డం దేశానికి, ప్ర‌జ‌ల‌కు అంత మంచిది కాద‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

దేనినైనా దాచ గ‌ల‌రేమో కానీ ప్ర‌జ‌ల‌కు చెప్ప‌కుండా ఏమీ చేయ‌లేర‌న్నారు. ఇలాగే బాధ్య‌తా రాహిత్యంతో, ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ వెళితే ఏదో ఒక రోజు దేశం అల్ల‌క‌ల్లోలం కాక మాన‌ద‌ని హెచ్చ‌రించారు.

ఇప్ప‌టికైనా ప్ర‌ధాన మంత్రి పొరుగునే ఉన్న ద్వీప దేశం శ్రీ‌లంక‌లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల గురించి ఆలోచించాల‌ని హిత‌వు ప‌లికారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌.

ప్ర‌జ‌ల‌ను ప్ర‌ధాన స‌మ‌స్య‌ల నుంచి త‌ప్పించేందుకే లేని పోని స‌మ‌స్య‌ల‌ను తీసుకు వ‌చ్చేందుకు బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.

అగ్ని ప‌థ్ స్కీం పేరుతో మీరు చేస్తున్న‌ది పూర్తిగా త‌ప్పు అని స్ప‌ష్టం చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు. న‌ల్ల ధ‌నం తెస్తాన‌న్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింది.

చివ‌ర‌కు ర‌క్ష‌ణ రంగాన్ని కూడా ప్రైవేట్ ప‌రం చేసే ఆలోచ‌న‌లో ఉండ‌డం దేశాన్ని మోసం చేసిన‌ట్లేన‌ని పేర్కొన్నారు.

Also Read : పార్ల‌మెంట్ లో అగ్నిప‌థ్ పైనే ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!