Rahul Gandhi : డ్ర‌గ్స్ స్వాధీనంపై మోదీ మౌన‌మేల – రాహుల్

ప్ర‌శ్నించిన కాంగ్రెస్ అగ్ర నేత కామెంట్స్

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు.

తాను గ‌తంలో సీఎంగా ప్రాతినిధ్యం వ‌హించిన గుజ‌రాత్ ఇవాళ డ్ర‌గ్స్ కు అడ్డాగా మారింద‌ని ఆరోపించారు. ప్ర‌తి రోజూ ఏదో ఒక చోట మాద‌క ద్రవ్యాలు దొరుకుతూనే ఉన్నాయ‌ని వాపోయారు.

ఇంత జ‌రుగుతున్నా ఎందుకు ప్రధాన మంత్రి(PM Modi) మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు. దీనికి దేశానికి స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ముంబై పోలీసుల యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్సీ) గుజ‌రాత్ లోని మెఫ‌శ్రీ‌డ్రోన్ త‌యారీ యూనిట్ ను ఛేదించారు. ఏకంగా పెద్ద మొత్తంలో ఊ. 1,026 కోట్ల విలువ‌లైన డ్ర‌గ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల‌తో దేశ వ్యాప్తంగా ఒక్క‌సారిగా ఉలికి పాటుకు గురైంది. ఇంత పెద్ద మొత్తంలో మాద‌క ద్ర‌వ్యాల‌ను స్వాధీనం చేసుకోవ‌డం గుజ‌రాత్ కు సంబంధించి ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

దీనిపై తీవ్రంగా స్పందించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోంద‌న్నారు. ఇంత వ‌ర‌కు పోర్టు యాజ‌మాన్యాన్ని ఎందుకు ప్ర‌శ్నించ లేద‌ని మోదీని నిల‌దీశారు.

గుజ‌రాత్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ డ్ర‌గ్స్ వ్యాపార‌మా అంటూ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. వేల కోట్ల విలువైన డ్ర‌గ్స్ గుజ‌రాత్ కు చేరుకుంటున్నాయి.

గాంధీ ..పటేల్ పుట్టిన పుణ్య‌భూమిలో ఈ విషాన్ని ఎవ‌రు వ్యాపింప చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : జంత‌ర్ మంతర్ లో మహా పంచాయ‌త్

Leave A Reply

Your Email Id will not be published!