Mohammed Siraj : జ‌స్ప్రీత్ బుమ్రా ప్లేస్ లో మ‌హ్మ‌ద్ సిరాజ్

సౌతాఫ్రికా జ‌ట్టుతో మిగ‌తా టి20 మ్యాచ్ ల‌కు

Mohammed Siraj :  హైద‌రాబాద్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది బీసీసీఐ. సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా ఇప్ప‌టికే ఎంపిక చేసిన జ‌స్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కార‌ణంగా త‌ప్పుకున్నాడు.

దీంతో బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు స్టార్ పేస‌ర్ బుమ్రా స్థానంలో సిరాజ్(Mohammed Siraj) ను ఎంపిక చేసింది. మిగిలి పోయిన మ్యాచ్ ల‌లో సిరాజ్ ఆడ‌నున్నాడు.

ద‌క్షిణాఫ్రికాతో తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన టి20 మ్యాచ్ లో బుమ్రా అనుకోకుండా గాయ‌ప‌డ్డాడు. అత‌డు ప్ర‌స్తుతం వెన్నునొప్పితో బాధ ప‌డుతున్నాడు. దీంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించాం. త్వ‌ర‌లోనే కోలుకుంటాడ‌ని ఆశిస్తున్నాం.

అత‌డి స్థానంలో త‌ప్ప‌ని ప‌రిస్థితిలో మ‌రో పేస‌ర్ కావాల్సి వ‌చ్చింది. అందుకే మ‌హ్మ‌ద్ సిరాజ్ స‌రైన బౌల‌ర్ గా ఎంపిక చేయాల్సి వ‌చ్చింద‌ని బీసీసీఐ అధికారిక ట్విట్ట‌ర్ లో తెలిపింది.

కాగా అక్టోబ‌ర్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ(BCCI). వెన్ను నొప్పి తీవ్రం కావ‌డంతో జ‌స్ప్రీత్ బుమ్రా ఉంటాడా లేదా అన్న‌ది క్లారిటీ ఇవ్వ‌లేదు సెలెక్ష‌న్ క‌మిటీ. ఇప్ప‌టికే బుమ్రా ఆసియా క‌ప్ లో ఆడ‌లేక పోయాడు. ఇక మిగ‌తా టి20 మ్యాచ్ లకు జ‌ట్టు ఇలా ఉంది.

రోహిత్ శ‌ర్మ కెప్టెన్, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్. కోహ్లీ, సూర్య కుమార్ , రిష‌బ్ పంత్, దినేష్ కార్తీక్, ఆర్ అశ్విన్ , చాహ‌ల్ , అక్ష‌ర్ ప‌టేల్ , అర్ష్ దీప్ సింగ్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , ఉమేష్ యాద‌వ్ , దీప‌క్ చాహ‌ర్ , అయ్య‌ర్ , షాబాజ్ అహ్మ‌ద్ , సిరాజ్ ఆడ‌తారు.

Also Read : సంజూ శాంస‌న్ అద్భుత ఆట‌గాడు

Leave A Reply

Your Email Id will not be published!