Mohammed Zubair : బెదిరించ‌డం ప్ర‌జాస్వామ్య‌మా – జుబేర్

ట్విట్టర్ మాజీ సిఇఓ కామెంట్స్ పై స్పంద‌న

Mohammed Zubair : ఫ్యాక్ట్ చెక‌ర్ కో ఫౌండ‌ర్ మ‌హ్మ‌ద్ జుబేర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భార‌త దేశంలో మోదీ ప్ర‌భుత్వం తీవ్ర స్థాయిలో బెదిరింపుల‌కు పాల్ప‌డింద‌ని, వీలైతే త‌మ ఉద్యోగుల‌ను అరెస్ట్ చేస్తామ‌ని హెచ్చ‌రించింద‌టూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ మాజీ సిఇవో జాక్ డోర్సే. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ వ‌ర‌ల్డ్ వైడ్ గా వైర‌ల్ గా మారాయి. భార‌త దేశంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌ముఖులు, మేధావులు, జ‌ర్న‌లిస్టులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మోదీ నిరంకుశ‌త్వ పాల‌న‌కు ఇది ఒక నిద‌ర్శ‌నం మాత్ర‌మేన‌ని పేర్కొంటున్నారు.

ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడారు జాక్ డోర్సే. మోదీ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. త‌మ సంస్థ‌ను మూసి వేసేలా ఒత్తిళ్లు తీసుకు వ‌చ్చారంటూ నిప్పులు చెరిగారు. ఇదంతా ఆనాడు న‌రేంద్ర మోదీ నేతృత్వంలో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేప‌ట్టిన ఆందోళ‌న‌కు సంబంధించి ఈ ఆదేశాలు వ‌చ్చాయ‌ని ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా జాక్ డోర్సే చెప్పిన దాంట్లో వంద శాతం నిజాయితీ ఉంద‌న్నారు ఫ్యాక్ట్ చెక‌ర్ కో ఫౌండ‌ర్ జుబేర్(Mohammed Zubair). ఆయ‌న‌ను కూడా దేశానికి, మోదీ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా ట్వీట్ చేశార‌న్న కార‌ణంతో అరెస్ట్ చేశారు. చివ‌ర‌కు కోర్టు జోక్యం చేసుకోవ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ప్ర‌స్తుతం జాక్ డోర్సే చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించాడు జుబేర్.

Also Read : Bhatti Vikramarka : జ‌నం కోసం బీఆర్ఎస్ పై పోరాటం – భ‌ట్టి

Leave A Reply

Your Email Id will not be published!