Mohammed Zubair : మ‌హ్మ‌ద్ జుబైర్ కు బెయిల్ మంజూరు

రూ. 50,000 వ్య‌క్తిగ‌త పూచీ క‌త్తు క‌ట్టాలి

Mohammed Zubair : ఆల్ట్ న్యూస్ కో ఫౌండ‌ర్ మ‌హ్మ‌ద్ జుబైర్(Mohammed Zubair) కు బెయిల్ మంజూరైంది. అయితే దేశం విడిచి వెళ్ల‌డానికి వీలు లేదంటూ స్ప‌ష్టం చేసింది. 2018 సంవ‌త్స‌రంలో న‌మోదు చేసిన ట్వీట్ పై కేసు న‌మోదు చేశారు ఢిల్లీ పోలీసులు.

యూపీ లో న‌మోదైన కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయ‌క పోవ‌డాన్ని స‌వాల్ చేశారు జుబైర్. కోర్టును ఆశ్ర‌యించారు. రూ. 50,000 పూచీ క‌త్తు క‌ట్టాల‌ని తెలిపింది.

జుబైర్ ను జూన్ 27న అరెస్ట్ చేశారు. ఆయ‌న‌పై హ‌త్రాస్ లో రెండు కేసులు న‌మోదు కాగా ఘ‌జియాబాద్ , ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ , ల‌ఖింపూర్ ఖేరీ , సీతాపూర్ లో ఒక్కొక్క‌టిగా న‌మోదైంది.

శుక్ర‌వారం ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమ‌తి లేకుండా వాస్త‌వ త‌నిఖీ చేసే వ్య‌క్తి దేశం విడిచి వెళ్ల కూడ‌దంటూ స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ కోర్టు న్యాయ‌మూర్తి ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న వేశారు.

స‌రే జుబైర్ వ‌ల్ల ఎంత న‌ష్టం జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు. పోనీ ఆయ‌న చేసిన ట్వీట్ వ‌ల్ల ఎంత మంది బాధ ప‌డ్డారో చెప్పాల‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నిల‌దీశారు.

మ‌త ప‌ర‌మైన మనోభావాల‌ను దెబ్బ తీసినందుక యూపీ లోని ప‌లు జిల్లాల్లో త‌న‌పై న‌మోదైన ఆరు ఎఫ్ఐఆర్ ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ జుబైర్ సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్ర‌యించాడు. అన్ని కేసుల్లో త‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ కూడా కోరాడు.

ఇదిలా ఉండ‌గా యూపీలో న‌మోదైన ఆరు కేసుల‌ను విచారించేందుకు యూపీ ఐజీ డాక్ట‌ర్ ప్రీతీంద‌ర్ సింగ్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసింది.

Also Read : ద‌లేర్ మెహందీకి 2 ఏళ్ల‌ జైలు శిక్ష‌..జ‌రిమానా

Leave A Reply

Your Email Id will not be published!