Mohammed Zubair : నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి జుబైర్
2018 లో చేసిన ట్వీట్ పై అరెస్ట్
Mohammed Zubair : మత పరమైన మనోభావాలను దెబ్బ తీసేలా 2018లో చేసిన ట్వీట్ కు సంబంధించిన కేసులో ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్(Mohammed Zubair) ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పర్చడంతో విచారణ నిమిత్తం నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది.
పేరు, విశ్వాసం, వృత్తి కారణంగా లక్ష్యంగా చేసుకున్నారని జుబైర్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ జుబైర్(Mohammed Zubair ) ఇంటి నుండి అతడి ల్యాప్ టాప్ ను తిరిగి పొందేందుకు బెంగళూరుకు తీసుకు వెళ్లేందుకు కోర్టు పోలీస్ కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను బుధవారం సెషన్స్ కోర్టులో జుబైర్ న్యాయవాది బృందం సవాల్ చేయనుందని సమాచారం. ఇదిలా ఉండా మహ్మద్ జుబైర్ ను ఈనెల 27న అరెస్ట్ చేశారు.
ఒక రోజు రిమాండ్ కు పంపారు. మరో ఐదు రోజులు విచారణ చేపట్టేందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టుకు విన్నవించారు పోలీసులు. ఈ సందర్బంగా కోర్టులో పలు వాదనలు కొనసాగాయి.
మార్చి 2018లో చేసిన ట్వీట్ కేవలం సెన్సార్ బోర్డు ద్వారా క్లియర్ చేసిన సినిమా అని పేర్కొన్నారు. ఇది పూర్తిగా అసంబద్దం అని వాదించారు. జుబైర్ లాయర్ బృందా గోవర్ పూర్తిగా కక్ష సాధింపుతోనే ఇలా అదుపులోకి తీసుకున్నారని ఆరోపించింది.
అతడు శక్తివంతమైన వ్యక్తులను సవాల్ చేస్తూ ఉండవచ్చు. కానీ అతడి వేధింపులకు అది కారణం కాదని వాదించారు న్యాయవాది. ఇదిలా ఉండగా 2017లో లాభాపేక్ష రహిత సంస్థగా ఆల్ట్ న్యూస్ స్థాపించారు జుబైర్ , సిన్హా.
Also Read : జుబైర్ అరెస్ట్ అప్రజాస్వామికం – ఓవైసీ