Mohammed Zubair : ఎట్టకేలకు విడుదలైన మహ్మద్ జుబైర్
ఏడు కేసులలో తాత్కాలిక బెయిల్ మంజూరు
Mohammed Zubair : ఎట్టకేలకు ఫ్యాక్ట్ చెకర్, ఆల్ట్ న్యూస్ కో ఫౌండర్ మహ్మద్ జుబైర్ కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. మత పరమైన భావనలు రెచ్చ గొట్టారంటూ పోలీసులు అరెస్ట్ చేశారు.
2018లో చేసిన ట్వీట్ ను ఆధారంగా చేసుకుని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆపై హిందూ నాయకులను దూషించారంటూ యూపీ, తదితర రాష్ట్రాలలో మొత్తం 7 కేసులు నమోదయ్యాయి మహ్మద్ జుబైర్ పై.
తన ట్వీట్ల ద్వారా మత పరమైన మనో భావాలను దెబ్బ తీశారంటూ ప్రధానమైన ఆరోపణ. జుబైర్ ను గత నెల జూన్ 27న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన కామెంట్స్ చేసింది. రాయొద్దంటూ ఎలా చెప్పగలమని ప్రశ్నించారు.
నమోదు చేసిన కేసులన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కాబట్టి తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీజే చంద్రచూడ్. వెంటనే అతడిని విడుదల చేయాలంటూ ఆదేశించారు.
దీంతో బుధవారం రాత్రి 9 గంటలకు తీహార్ జైలు నుంచి బయట పడ్డాడు మహ్మద్ జుబైర్(Mohammed Zubair). అరెస్ట్ ల అధికారాన్ని పొదుపుగా కొనసాగించాలన్నది చట్టంలోని సూత్రం.
ప్రస్తుత సందర్బంలో అతన్ని నిరంతర నిర్బంధంలో ఉంచడం , వివిధ కోర్టులలో అంతులేని రౌండ్ ప్రొసీడింగ్ లకు గురి చేయడం సమర్థనీయం కాదని పేర్కొంది ధర్మాసనం.
Also Read : పంజాబ్ లో గ్యాంగ్ స్టర్లు ఎన్ కౌంటర్