Mohan Charan Majhi: ఒడిశా నూతన సీఎంగా మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణ స్వీకారం !

ఒడిశా నూతన సీఎంగా మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణ స్వీకారం !

Mohan Charan Majhi: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్‌ చరణ్ మాఝి ప్రమాణస్వీకారం చేశారు. దీనితో రాష్ట్రంలో బీజేపీ తరఫున తొలి సీఎంగా మోహన్ మాఝి రికార్డు సృష్టించారు. ఆయనతోపాటు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కనక్‌ వర్ధన్‌ సింగ్‌దేవ్, తొలిసారి ఎమ్మెల్యే అయిన ప్రవతి పరీదాలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితోపాటు మంత్రులుగా సురేశ్‌ పుజారి, రబీనారాయణ్‌ నాయక్‌, నిత్యానంద గోండ్‌, కృష్ణ చంద్ర పాత్ర ప్రమాణం చేశారు. గవర్నర్‌ రఘుబర్‌దాస్‌ చేతులమీదుగా ఈ కార్యక్రమం జరిగింది. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా హాజరయ్యారు.

Mohan Charan Majhi….

అంతకుముందు తాజా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ తో మోహన్‌ చరణ్‌(Mohan Charan Majhi) భేటీ అయ్యారు. నవీన్‌ నివాస్‌కు వెళ్లిన ఆయన ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని నవీన్‌ ను స్వయంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నవీన్‌ హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ… రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే, గిరిజన నేత మోహన్‌ చరణ్‌ మాఝి రైతు బిడ్డ. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పని చేశారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచిగా పనిచేసిన మాఝి… 2000లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన ఆయన… కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు 2000, 2009, 2019, మళ్లీ 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకూ శాసనసభలో బీజేపీ సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా విధులు నిర్వహించారు.

Also Read : B. S. Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు నోటీసులు !

Leave A Reply

Your Email Id will not be published!