Molla: తెలుగు కవయిత్రి

16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి మొల్ల.

ఆతుకూరి మొల్ల

Molla : ఆతుకూరి మొల్ల (1440-1530): కడప జిల్లా గోపవరం గ్రామంలో కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. మొల్ల(Molla) రచనా శైలి చాలా సరళమైనది మరియు రమణీయమైనది. తాళ్లపాక అన్నమయ్య (అన్నమాచార్య) భార్య తాళ్లపాక తిమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ రెండవ తెలుగు కవయిత్రి మొల్ల.

Molla – మొల్ల రచనా ప్రస్థానం

మొల్ల జీవిత కాలంపై పరిశోధకులలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవులలో ఒకరిని కూడా తనపద్యంలో ఆమె పేర్కొనని కారణంగా ఆమె రాయలవారి సమయాని కంటే ముందుగానే కవయిత్రి అయి ఉంటుందని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు. జనసామాన్యంలో ప్రచారంలో ఉన్న కథలు బట్టి తెనాలి రామలింగడు సమకాలీకురాలని మరికొంతమంది పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 16వ శతాబ్దానికి చెందిన ఏకామ్రనాధుడనే చరిత్రకారుడు తన ప్రతాపచరిత్రలో మొల్లను పేర్కొన్నాడు. అందులో పేర్కొన్న సాంఘిక పరిస్థితులను బట్టి మొల్ల సుమారుగా 1581 కి ముందుగా జీవించి ఉండేదనిపిస్తున్నది. ఆమె తిక్కన సోమయాజికీ, భాస్కరునికీ, ప్రతాపరుద్రునికీ సమకాలీనురాలు కావచ్చును కూడా అని మరికొన్ని పరిశోధనలు తెలుపుతున్నాయి.

మొల్ల రామాయణం

శ్రీ కృష్ణదేవరాయలు సమయంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది. మొల్ల రామాయణం ఆరు కాండాలలో 871 పద్యాలతో రచించింది. ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజులలో రాసిందని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధంగా వాడుక భాషకు దగ్గరగా ఉంది. తెలుగులో వ్రాయబడిన అనేక రామాయణాలలో మొల్ల రామాయణం చాలా సరళమైనది. మొల్ల జ్ఞాపకార్థం 2017లో భారత ప్రభుత్వం మొల్ల తపాలా బిళ్ల విడుదల చేసింది.

Also Read : Malladi Venkata Krishna Murthy: ఆంధ్రుల ఆహ్లాద రచయిత

Leave A Reply

Your Email Id will not be published!