KTR : ఐటీ హబ్ లతో మస్తు కొలువులు
స్పష్టం చేసిన మంత్రి కేటీఆర్
KTR : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో గురువారం ఐటీ హబ్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఐటీ అంటేనే ఇవాళ హైదరాబాద్ అనేంతగా పేరు తీసుకు వచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఒకప్పుడు ఐటీ అంటే అమెరికా లేదా బెంగళూరు అనే వాళ్లని కానీ సీన్ మారిందన్నారు. ఇవాళ ప్రపంచంలో మోస్ట్ పాపులర్ కంపెనీలన్నీ హైదరాబాద్ లో కొలువు తీరి ఉన్నాయని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు కేటీఆర్.
తమ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందన్నారు. హైదరాబాద్ కాకుండా ఇతర ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు కూడా ఐటీని విస్తరించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు కేటీఆర్(KTR). ఐటీ హబ్ లను ఏర్పాటు చేయడం వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని స్పష్టం చేశారు. యువత ప్రతిభ కలిగి ఉంటే అవకాశాలకు కొదవే లేదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషీన్ లెర్నింగ్ , సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్ , తదితర వాటిలో ప్రావీణ్యం సంపాదిస్తే తమకు తోచినంత శాలరీస్ పొందవచ్చని తెలిపారు కేటీఆర్.
ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఐటీ అనుబంధ పరిశ్రమలలో కొలువు తీరిన జాబర్స్ ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. తాను కన్న కల నిజమైందని రాబోయే రోజుల్లో మరిన్ని టీ హబ్ లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Also Read : Bandi Sanjay : మోదీ హయాంలో జనరంజక పాలన