Rajnath Singh INS : శక్తి వంతమైన యుద్ద నౌక మోర్ముగావో
స్పష్టం చేసిన రాజ్ నాథ్ సింగ్
Rajnath Singh INS : ఐఎన్ఎస్ మోర్ముగావో భారతదేశం తయారు చేసిన శక్తివంతమైన యుద్ద నౌకలలో ఒకటి అని పేర్కొన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. హిందూ మహా సముద్ర ప్రాంతంలో రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేసేందుకు ఇది మరింత కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ , ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఆదివారం ఐఎన్ఎస్ మోర్ముగావ్ యుద్ద నౌకను ప్రారంభించారు. ఈ యుద్ద నౌక ముంబై లోని భారత నావికా దళంలోకి ప్రవేశించింది. ఈ యుద్ధ నౌక సముద్ర పరాక్రమాన్ని పెంపొందించేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh INS).
క్షపణి విధ్వంసక నౌక ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉందన్నారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని, దాని ప్రాముఖ్యత గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు రక్షణ శాఖ మంత్రి. ఈ యుద్ధ నౌక ప్రస్తుతం మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
అంతే కాకుండా నౌకా నిర్మాణాన్ని కూడా భారత్ కొనసాగిస్తుందని ఆ నమ్మకం తనకు ఉందన్నారు రాజ్ నాథ్ సింగ్. ఈ నౌకను 75 శాతం స్వదేశీయంగా తయారు చేశారని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ ను నొక్కి చెబుతుందన్నారు. అంటే అర్థం స్వయం ఆధారమైన భారత దేశం అని పేర్కొన్నారు కేంద్ర మంత్రి.
ఇందులో క్షిపణులు, టార్పెడో ట్యూబ్ లు , లాంచర్లు, యాంటీ సబ్ మెరైన రాకెట్ లాంచర్లు, సూపర్ రాపిడ్ గన్ మౌంట్ లు ప్రధాన ఆయుధ వ్యవస్థలలో ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా ఆధునిక నిఘా రాడార్ తో నౌకను అమర్చారు.
Also Read : అభివృద్ది నినాదం అదే మా లక్ష్యం – మోదీ
