Virat Kohli : త‌ప్పుకున్నా జోరు త‌గ్గ‌ని కోహ్లీ

మోస్ట్ పాపుల‌ర్ క్రికెట్ ప్లేయ‌ర్

Virat Kohli : ప్ర‌పంచ క్రికెట్ లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన ఆట‌గాడిగా ఇప్ప‌టికే గుర్తింపు పొందాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). ఇప్ప‌టికే విజ‌య‌వంత‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందాడు.

కెప్టెన్సీ ప‌ద‌వికి రాజీనామా చేశాడు. అయినా జోరు త‌గ్గ‌లేదు. బ్రాండ్ వాల్యూలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఏడాదికి కోట్ల‌ల్లో ఉంటుంది అత‌డి సంపాద‌న‌. ఒక్క ఇన్ స్టా గ్రామ్ నుంచే కోహ్లీకి భారీ ఆదాయం స‌మ‌కూరుతోంది.

ఇక ఇత‌ర కంపెనీల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. తాజాగా కోహ్లీకి (Virat Kohli)అరుదైన గౌర‌వం ద‌క్కింది. కోహ్లీకి మ‌రో పేరు కూడా ఉంది అదేమిటంటే మెషిన్ గ‌న్ అని.

2022 జ‌న‌వ‌రి నెల‌కు గాను భార‌త దేశంలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ప్లేయ‌ర్ గా విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచాడు. ఓర్మాక్స్ మీడియా అత్యంత పాపుల‌ర్ ఆట‌గాడు ఎవ‌ర‌నే దానిపై స‌ర్వే చేప‌ట్టింది.

ఇందులో నంబ‌ర్ వ‌న్ లో కోహ్లీ నిలిచాడు. ఆ త‌ర్వాతి స్థానంలో ఎం.ఎస్. ధోనీ ద‌క్కించుకున్నాడు. భార‌త జ‌ట్టు స్కిప్ప‌ర్ గా ఇటీవ‌లే నియ‌మితుడైన రోహిత్ శ‌ర్మ‌కు మూడో స్థానం ద‌క్కింది.

ఈ త‌రం క్రికెట్ లో మోస్ట్ డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ గా కూడా కోహ్లీకి పేరుంది. ఒక్క‌సారి కుదురుకున్నాడంటే ఇక ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. అత్యంత టాలెంటెడ్ ఆట‌గాడిగా మ‌న దేశంలోనే కాదు దాయాది పాకిస్తాన్ లో సైతం ఇష్ట ప‌డ‌తారు ఎక్కువ‌గా.

ఇక నాలుగో ప్లేస్ లో స‌చిన్ ఉంటే ఐదు, ఆరు స్థానాల్లో రొనాల్డో, మెస్సీలు ఉన్నారు. ఏడో స్థానంలో సింధు, ఎనిమిదో ప్లేస్ లో సైనా నెహ్వాల్ , 9వ స్థానంలో కేఎల్ రాహుల్ ఉండ‌గా ప‌దో స్థానంలో సానియా మీర్జా ఉన్నారు.

Also Read : భార‌త్ తో సీరీస్ కు లంకేయులు రెడీ

Leave A Reply

Your Email Id will not be published!