Sri Lanka T20 Squad : భార‌త్ తో సీరీస్ కు లంకేయులు రెడీ

జ‌ట్టును ప్ర‌క‌టించిన లంక క్రికెట్ బోర్డు

Sri Lanka T20 Squad : భార‌త జ‌ట్టుతో ఆడే టీ20 సీరీస్ కు త‌మ టీమ్ ను డిక్లేర్ చేసింది శ్రీ‌లంక క్రికెట్ సెల‌క్ష‌న్ క‌మిటీ. ఈ విష‌యాన్ని అధికారికంగా వెల్ల‌డించింది. ఈ సీరీస్ కు సంబంధించి ద‌సున్ ష‌న‌క స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తాడు.

మొత్తం సీరీస్ కు సంబంధించి 18 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది క్రికెట్ బోర్డు. ఇక టీమ్ కు వైస్ కెప్టెన్ గా చ‌రిత్ అస‌లంక ఎంపిక‌య్యాడు. ఇదిలా ఉండ‌గా అవిష్క ఫెర్నాండో, సువాన్ తుషార‌, ర‌మేష్ మెండీస్ ఈ సీరీస్ కు దూరం పెట్టింది.

అయితే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇబ్బంది ప‌డి ఆసిస్ టూర్ కు దూర‌మైన వ‌నిందు హ‌స‌రంగా తిరిగి టీమ్ లోకి వ‌చ్చాడు. ఆసిస్ టూర్ లో 5 టీ20 ల సీరీస్ పూర్తిగా ఓట‌మి మూట‌గ‌ట్టుకుని ఇంటి బాట ప‌ట్టింది.

ఇక భార‌త జ‌ట్టు ప‌రంగా చూస్తే విండీస్ ను టీ20, వ‌న్డే సీరీస్(Sri Lanka T20 Squad) గెలుచుకుని ఉత్సాహంతో ఉర‌క లేస్తోంది. ఈ త‌రుణంలో స్పిన్న‌ర్ అషియ‌న్ డానియ‌ల్ ఆ దేశం త‌ర‌పున అరంగేట్రం చేయ‌నున్నాడు.

5 మ్యాచ్ ల‌లో భాగంగా జ‌రిగిన సీరీస్ లో 4-1 తో సీరీస్ కోల్పోయింది. ఇక ఇండియా టూర్ సంద‌ర్భంగా శ్రీ‌లంక జ‌ట్టు మూడు టీ20 మ్యాచ్ లు, రెండు టెస్టు మ్యాచ్ లు ఆడ‌నుంది.

ఈనెల తొలి టి20 మ్యాచ్ ల‌క్నో వేదిక‌గా 24న జ‌ర‌గ‌నుంది. ఇక టీ20 జ‌ట్టు ఇలా ఉంది. ష‌న‌క కెప్టెన్ కాగా , నిస్సాంక‌, కుస‌ల్ మెండిస్ , చ‌రిత్ అస‌లంక‌, దినేష్ చండీమాల్ , గుణ తిల‌క‌, క‌మిల్ మిషార‌, జ‌నిత్ లియానాగే, వ‌నిందు హ‌స‌రంగా, చ‌మిక క‌రుణ‌ర‌త్నే, దుష్యంత చ‌మీర‌, ల‌హిరు కుమార‌, బినుర ఫేర్నాన్డో, మ‌హీష్ , జెఫ్రీ వాండ‌ర్సే, ప్ర‌వీణ్ జ‌య‌విక్ర‌మ‌, డేనియ‌ల్ ఉన్నారు.

Also Read : ఐపీఎల్ పై క‌న్నేసిన ‘రిల‌య‌న్స్..అమెజాన్’

Leave A Reply

Your Email Id will not be published!