BE Corbevax : పిల్ల‌ల‌కు బీఈ వ్యాక్సిన్ కు ఓకే

ప‌ర్మిష‌న్ వ‌చ్చింద‌న్న కంపెనీ

BE Corbevax : క‌రోనా వ్యాక్సినేష‌న్ త‌యారీలో భార‌త్ ముందంజ‌లో ఉంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ ఐటీ హ‌బ్ తో పాటు ఫార్మా హబ్ గా వినుతికెక్కింది. కోవాగ్జిన్ త‌యారీ దారు కంపెనీ హైద‌రాబాద్ కు చెందిందే.

తాజాగా మ‌రో హైద‌రాబాద్ ఫార్మా కంపెనీ బ‌యోలాజిక‌ల్ ఈ లిమిటెడ్ కంపెనీ పిల్ల‌ల కోసం త‌యారు చేసిన కొర్బో వ్యాక్స్ వ్యాక్సిన్ కు అనుమ‌తి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని బీఈ లిమెటెడ్ సంస్థ అధికారిక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా గ‌త నెల 3 నుంచి భార‌త్ బ‌యో టెక్ కంపెనీ 15 నుంచి 18 సంవ‌త్స‌రాల యుక్త వ‌య‌స్కుల‌కు వ్యాక్సిన్ అందిస్తోంది. తాజాగా దాని స‌ర‌స‌న బ‌యోలాజిక‌ల్ ఈ కంపెనీ త‌యారు చేసిన పిల్ల‌ల వ్యాక్సిన్ కూడా రానుంది.

అత్య‌వ‌రంగా వ్యాక్సిన్ గా వినియోగించేందుకు అనుమ‌తి పొందింది. ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌లు కేంద్ర స‌ర్కార్ ఈ కంపెనీతో ఒప్పందం చేసుకుంది.

బీఇ కంపెనీ త‌యారు చేసిన కొర్బోవ్యాక్స్ వ్యాక్సిన్(BE Corbevax) 12 ఏళ్ల నుంచి 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగిన పిల్ల‌ల కోసం ఉప‌యోగించేందుకు వీలు క‌లుగుతుంది.

2019 డిసెంబ‌ర్ లో రెగ్యులేట‌రీ డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ద్వారా లైన్ క్లియ‌ర్ అయ్యింది. మ‌ధ్యంత‌ర ఫ‌లితాల అనంత‌రం రెండో ద‌శ‌,

మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌యల్ అధ్య‌య‌నం త‌ర్వాత అనుమ‌తి ల‌భించింది. నిపుణుల‌తో కూడిన ప్యాన‌ల్ ఈ మేర‌కు నివేదిక స‌మ‌ర్పించ‌డంతో ఈ వ్యాక్సిన్ కు ఓకే ల‌భించిన‌ట్ల‌యింది.

ఇప్ప‌టికే భార‌త్ వ్యాక్సినేష‌న్ లో ప్ర‌పంచంలోనే రెండో స్థానంలో ఉంది. చైనా ఫ‌స్ట్ ప్లేస్ లో కొన‌సాగుతోంది.

Also Read : పిల్ల‌ల‌కు బీఈ వ్యాక్సిన్ కు ఓకే

Leave A Reply

Your Email Id will not be published!