Modi : అన్ని భాషల్లో కంటే మాతృ భాష గొప్పదన్నారు ప్ఱధాన మంత్రి మోదీ. మాతృ భాషతో పాటు అన్య భాషలను కూడా నేర్చు కోవాలని సూచించారు. భిన్నమైన భాషల కలయికనే భారత దేశం అని అన్నారు.
ప్రజాదరణ పొందిన పలు భారతీయ గీతాలను వివిధ భాషల్లో వీడియోలుగా రూపొందించి వాటిని ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చిన ఘనత మనదేనన్నారు. దేశ భిన్నత్వాన్ని కొత్త తరానికి, రాబోయే తరాలకు పరిచయం చేయాలని ప్రధాని యువతకు పిలుపునిచ్చారు.
టాంజానియాకు చెందిన కిలి పైల్, నీమాలను ఈ సందర్భంగా ఉదహరించారు. మోదీ(Modi ) జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఆదరణ చూరగొంటోందన్నారు.
మాతృ భాషా దినోత్సవం ఇటీవల జరుపు కోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో 121 మాతృ భాషలు ఉన్నాయని వీటిలో 14 భాషలను కోటి మందికి పైగా ప్రజలు నిత్యం మాట్లాడుతున్నారని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే మూడు భాషల్లో హిందీ కూడా ఒక్కటని తెలిపారు. దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అయినా ఇంకా మాతృ భాషలో మాట్లాడాలంటే నామోషీగా ఫీలవుతున్నారని, ఎక్కడా మీరు అన్యధా భావించ వద్దని సూచించారు.
తల్లి భాషలో పట్టు సాధిస్తే ఏ భాష అయినా పరిణతి సాధించ వచ్చని అన్నారు నరేంద్ర మోదీ.
Also Read : మనోళ్లను సురక్షితంగా తీసుకు వస్తాం