Mothkupalli Narsihmulu : చంద్రబాబు అరెస్ట్ అన్యాయం
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
Mothkupalli Narsihmulu : హైదరాబాద్ – మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు మద్దతుగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చాలక ఇప్పుడు పనిమంతుడైన చంద్రబాబును అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
Mothkupalli Narsihmulu Objects Chandrababu Arrest
ఏపీ స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుడుకు ఎలాంటి పాత్ర లేదన్నారు మోత్కుపల్లి నర్శింహులు(Mothkupalli Narsihmulu). కేవలం కక్ష సాధింపు ధోరణితో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
175 సీట్లలో కనీసం 4 సీట్లు కూడా వైసీపీకి రావని పేర్కొన్నారు మోత్కుపల్లి నర్శింహులు. ఆనాడు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు తాను సిగ్గు పడుతున్నానని, ఇవాళ తన తప్పు ఒప్పుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టుండి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రశంసించడం కలకలం రేపుతోంది.
Also Read : WFI Chief Comment : మోదీజీ దేశం సిగ్గు పడుతోంది