MP Aravind : రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది – బీజేపీ ఎంపీ అరవింద్

రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుంది - బీజేపీ ఎంపీ అరవింద్

MP Aravind: ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీలేదు.. రైతు భరోసా లేదు.. బోనస్ ముచ్చటే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(MP Aravind) విమర్శించారు. మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత అయినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన ఎన్నో స్కాములు, అవినీతిని బట్టబయలు చేశారని అన్నారు. కాంగ్రెస్‌కు హైదరాబాద్‌లో సీట్లు రాలేదు.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వచ్చాయని చెప్పారు. ఇవాళ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగింది. ఈ దీక్షలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

MP Aravind Comment

అందుకే ఇక్కడ పేదల ఇళ్లను కూలుస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్లు తెలంగాణలో ప్రజా కంటగింపు పాలనను చూశామన్నారు. కేసీఆర్ ఇక అధికారంలోకి రాడని.. నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. ముస్లింలను ఒకలా.. హిందువులను మరోలా చూస్తున్నారని ధ్వజమెత్తారు. హిందువుల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తుందని ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీలేదు.. రైతు భరోసా లేదు.. బోనస్ ముచ్చటే లేదని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేరని ఎంపీ అరవింద్ అన్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో పోతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అగ్రికల్చర్ పాలసీ ఎందుకు తీసుకురాలేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు అల్లం, పసుపుకు తేడా తెలియదని.. ఆయన కూడా ఈరోజు మాట్లాడుతున్నారని ఎంపీ అరవింద్(MP Aravind) ఎద్దేవా చేశారు. కేసీఆర్‌లాగే వరి మాత్రమే వేసుకునే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. రేవంత్ ప్రభుత్వంలో రైతు భరోసా కాదు.. బీమా కూడా అందట్లేదని ఎంపీ అరవింద్ ఆరోపించారు.

రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటే.. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని కోరారు. కేసీఆర్‌ను ఆయన ఫ్యామిలీని చూసి ఇప్పటి పరిస్థితుల్లో ఎవరూ ఓటు వేయరని అన్నారు. బీజేపీ నేతలు అంతా ఇలాగే కలిసి కట్టుగా బలమైన అపొజిషన్‌గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మనదేనని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.

Also Read : MLA K Srinivasa Rao: తిరువూరును రక్షించండి ఎమ్మెల్యే కొలికపూడి మాకొద్దు ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు

Leave A Reply

Your Email Id will not be published!