Arjun Singh : టీఎంసీలో చేరిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్
ఆ పార్టీ వల్ల రాష్ట్రానికి తీరని నష్టం
Arjun Singh : పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇటీవల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీ అర్జున్ సింగ్ కాషాయ కండువాను వదిలేశారు. ఆదివారం బీజేపీకి గుడ్ బై చెప్పి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇటీవల జూట్ ధరలను క్వింటాలుకు రూ. 6, 500కి పరిమితం చేస్తూ మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ ను ఉపసంహరించు కోవడంపై అర్జున్ సింగ్(Arjun Singh) తీవ్రంగా తప్పు పట్టారు. కేంద్రం రైతులను కావాలని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ మండిపడ్డారు.
అర్జున్ సింగ్ తృణమూల్ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీని కామాక స్ట్రీట్ కార్యాలయంలో కలిశారు. ఆయనకు సాదర స్వాగతం పలికి పార్టీ
కండువా కప్పి టీఎంసీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకు అర్జున్ సింగ్ భారతీయ జనతా పార్టీకి మాజీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ సందర్భంగా తనకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని, పార్టీలో సరిగా పని చేయనీయడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు అర్జున్ సింగ్.
సింగ్ తో పాటు జనపనార పరిశ్రమ వాటాదారులు గత కొన్ని వారాలుగా ధర తగ్గించడాన్ని తప్పు పడుతూ వచ్చారు.
ఆయన విసుగు చెంది చివరకు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని బరాక్ పూర్ లోక్ సభ నియోజకవర్గానికి అర్జున్
సింగ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఆరు నెలలుగా టీఎంసీతో చర్చలు జరుపుతున్నారు.
ఆయనను శాంతింప చేసేందుకు బీజేపీ హై కమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు టీఎంసీ బరాక్ పూర్ స్థౄనం నుండి దినేశ్ త్రివేదికి టికెట్ ఇవ్వడంతో అర్జున్ సింగ్ టీంఎసీని వీడారు.
ఆ స్థానం నుంచి రెండుసార్లు ఎంపీగా ఉన్న త్రివేదికి షాక్ ఇస్తూ ఎంపీగా విజయం సాధించారు. విచిత్రం ఏమిటంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న
లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న భట్పారా నుండి అర్జున్ సింగ్(Arjun Singh) కుమారుడు పవన్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.
దీంతో తండ్రి టీఎంసీలో చేరడంతో కొడుకు కూడా టీఎంసీ బాట పట్టనున్నారు.
Also Read : అద్దాలు తీయండి అభివృద్ధి చూడండి