Arjun Singh : రైతుల పట్ల మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల మరోసారి నిరసన వ్యక్తమైంది. విచిత్రం ఏమిటంటే కేంద్ర సర్కార్ ను కడిగి పారేసింది ఎవరో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులని అనుకుంటే పొరపాటు పడినట్లే.
సాక్షాత్తు భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ, పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్జున్ సింగ్. ఆయన కంటిన్యూగా రైతుల పక్షాన మాట్లాడుతున్నాడు. అవసరమైన ప్రతి సమయంలో వారికి మద్దతుగా నిలుస్తున్నాడు.
ఇదే సమయంలో రైతులు చేస్తున్న పోరాటానికి ఇదే భారతీయ జనతా పార్టీకి చెందిన మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్ తో పాటు యూపీ కి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ సైతం మోదీ సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని బహిరంగంగానే ఎండ గడుతూ వస్తున్నారు.
తాజాగా వారి జాబితాలోకి అర్జున్ సింగ్(Arjun Singh) కూడా చేరి పోవడం విశేషం. ఆయన మోదీని టార్గెట్ చేశారు. జనపనార విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు లోప భూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు.
దీని వల్ల జనపనారపై ఆధార పడిన లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై లేదా అని అర్జున్ సింగ్ ప్రశ్నించారు.
ఇలా ఎంత కాలం మన్ కీ బాత్ అంటూ కాలం వెళ్లదీస్తారంటూ నిలదీశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో జనపనార రైతులను ఆదుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఆయన లేఖ రాశారు.
మద్దతు ధర విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఎంపీ అర్జున్ సింగ్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది.
Also Read : గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్