Derek O Brien : ‘వెంకయ్య’పై ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ఫైర్
ఉప రాష్ట్రపతి వీడ్కోలు సమావేశంలో
Derek O Brien : రాజ్యసభలో సోమవారం ఉప రాష్ట్రపతిగా తన పదవీ కాలం పూర్తి చేసుకోనున్నారు. రాజ్యసభ చైర్మన్ గా ఉన్న వెంకయ్య నాయుడి స్థానంలో గెలుపొందిన జగదీప్ ధన్ ఖర్ ఆగస్టు 11న కొలువు తీరనున్నారు.
ఈ సందర్బంగా ఆయా పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్(Derek O Brien) షాకింగ్ కామెంట్స్ చేశారు చైర్మన్ పై. ఎగువ సభలో ప్రధాన అంశాలు చర్చకు వచ్చినా వాటిపై సరైన చర్చ జరగలేదన్నారు.
సెప్టెంబర్ 20, 2020న ఎగువ సభ ఇప్పుడు రద్దు చేయబడిన వ్యవసాయ బిల్లులను ఆమోదించిన రోజున ఆయన చైర్ లో లేడని ఎత్తి చూపారు.
బహుశా ఏదో ఒక రోజు మీరు మీ ఆత్మకథలో దానికి సమాధానం ఇస్తారని అనుకుంటున్నాననంటూ ఎంపీ వెంకయ్య నాయుడుని ఉద్దేశించి అన్నారు. ఒక రకంగా చమత్కరించారు.
భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఇంధన ధరల పెరుగుదలపై ఇదే చైర్మన్ సీటులో కూర్చున్న వెంకయ్య నాయుడు ఉద్వేగ భరితమైన ప్రసంగం చేశారని గుర్తు చేశారు.
కానీ ఇదే అంశంపై ఎంపీలు ప్రశ్నిస్తే దానికి జవాబు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పు కోలేదన్నారు టీఎంసీ ఎంపీ. 2013లో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి వెంకయ్య నాయుడు జోక్యం చేసుకున్నారని కానీ చైర్మన్ గా ఉన్న సమయంలో పెగాసస్ స్పై వేర్ పై ఎగువ సభలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
మార్చి 1, 2013న మీరు సభలో ఆరు నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్ పై జోక్యం చేసుకున్నారని కానీ గత కొన్నేళ్లుగా పెగాసస్ పై మాట్లాడేందుకు యత్నిస్తే చర్చకు ఒప్పు కోలేదన్నారు.
Also Read : రాజ్యసభకు వన్నె తెచ్చిన వెంకయ్య