MP Nutrition Scam : పోషకాహార స్కాం అసెంబ్లీలో ఆగ్రహం
బీజేపీ ప్రభుత్వ తీరుపై విపక్షాలు ఫైర్
MP Nutrition Scam : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పోషకాహార కుంభకోణం (న్యూట్రిషన్ స్కాం) (MP Nutrition Scam) పై పెద్ద ఎత్తున అసెంబ్లీలో రాద్దాంతం చోటు చేసుకుంది. రేషన్ రవాణా ట్రక్కుల నుండి లబ్దిదారుల సంఖ్యను గుర్తించేంత దాకా అక్రమాలు చోటు చేసుకున్నాయని జాతీయ మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది.
దీంతో ఈ స్కాంలో ఎవరు ఉన్నారనే దానిపై వివరాలు ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ అంశంపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ వివరణాత్మక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు సప్లిమెంటరీ పౌష్టికాహార పథకం అమలులో అవినీతి చోటు చేసుకుందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో అసెంబ్లో రోజంతా వాయిదా పడింది.
ఈనెల ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ఆడిటర్ ఈ విషయాన్ని గుర్తించారు. లబ్దిదారుల సంఖ్యను విపరీతంగా పెంచడం దాకా కళ్లు చెదిరే స్థాయిలో అవినీతి చోటు చేసుకుందని తేల్చారు.
ఇది పిల్లల పోషకాహార లోపం సమస్యను పరిష్కిరంచేందుకు ఉద్దేశించింది. ఈ అంశంపై నిరసనల కారణంగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ గతంలో రెండు సార్లు వాయిదా పడింది.
వివరణాత్మక ప్రకటన చేసేందుకు స్పీకర్ గిరీష్ గౌతమ్ ను అనుమతి కోరారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇదే అంశానికి సంబంధించి 15 వాయిదా తీర్మానాలు వచ్చాయని సీఎం ప్రకటన చేసేందుకు అనుమతించే లోపు వాటిపై చర్చించాలని కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ గోవింద్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
విపక్షాల డిమాండ్ కు స్పీకర్ నిరాకరించారు. విపక్షాల అభ్యంతరాల మధ్యనే సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పథకంలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోలేదన్నారు.
Also Read : అవినీతి కేసులో యెడ్డీపై విచారణకు ఆదేశం