Owaisi : నిరసనకారులపై బుల్డోజర్లు ఎక్కడ
కేంద్ర సర్కార్ కు ఎంపీ ఓవైసీ ప్రశ్న
Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి కేంద్రాన్ని నిలదీశారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మహ్మద్ ప్రవక్తపై బీజేపీకి చెందిన నూపుర్ వర్మ చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ కొన్ని చోట్ల ముస్లింలు ఆందోళన చేపట్టారు. యూపీ ప్రభుత్వం వారిని గుర్తించి, వారి ఇళ్లను కూల్చివేసింది.
మరి ఇవాళ కేంద్ర సర్కార్ తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీం కు వ్యతిరేకంగా దేశ మంతటా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రైళ్లు తగులబెట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు.
మరి ఈ నిరసనకారులు, ఆందోళనకారులకు సంబంధించిన ఇళ్లపై ఎందుకు బుల్డోజర్లు ప్రయోగించ లేదని ప్రశ్నించారు ఓవైసీ(Owaisi). ఇదిలా ఉండగా బీజేపీ బహిష్కరించిన నూపుర్ శర్మ త్వరలో దేశంలో బిగ్ లీడర్ గా ఎదుగుతారని ఎద్దేవా చేశారు.
ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ప్రధాన మంత్రి తప్పుడు నిర్ణయం వల్ల యువకులు రోడ్లపైకి వచ్చారు. తప్పు ఎవరిది.
ఈ నిర్ణయం మీరు ఎవరిని అడిగి తీసుకున్నారు. కనీసం ప్రతిపక్షాలతో కానీ లేదా రక్షణ రంగానికి సంబంధించిన నిపుణులతో సంప్రదించారా అంటూ నిప్పులు చెరిగారు ఓవైసీ.
కానీ ఎవరి ఇళ్లను కూల్చడాన్ని తాము ఒప్పుకోమన్నారు. నిరసనకారులు పిల్లల్లాంటి వారని వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ యూపీలోని వారణాసికి చెందిన సీనియర్ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు ఎంపీ.
మరి ముస్లింలు మీ పిల్లలు కాదా. తాము కూడా ఈ దేశానికి చెందిన పిల్లలమేనని గుర్తించాలన్నారు.
Also Read : అగ్నిపథ్ ను ఆపాలంటూ సీఎంకు విన్నపం