Parvesh Verma : ఎక్సైజ్ పాల‌సీలో కేసీఆర్ ఫ్యామిలీ

బీజేపీ ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ కామెంట్స్

Parvesh Verma : ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ ఇప్పుడు దేశ రాజ‌ధానిలో హాట్ టాపిక్ గా మారింది. తాము ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ లేద‌ని ఆప్ స‌ర్కార్ చెబుతోంది. గ‌తంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ సంత‌కం చేశారంటూ ఆరోపించింది.

ఇదే స‌మ‌యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ డిప్యూటీ సీఎంతో పాటు మ‌రో 14 మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసింది. మొద‌టి నిందితుడిగా సిసోడియాను పేర్కొంది. దాదాపు 14 గంట‌ల‌కు పైగా సోదాలు చేప‌ట్టింది.

చివ‌ర‌కు డిప్యూటీ సీఎంకు చెందిన మొబైల్ , కంప్యూట‌ర్లు, ల్యాప్ టాప్ ల‌ను సీజ్ చేసింది. ఇందుకు సంబంధించి ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. నిన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కేజ్రీవాల్ పై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

అవినీతిలో కేజ్రీవాల్ కింగ్ మేక‌ర్ అంటూ మండిప‌డ్డారు. ఈ త‌రుణంలో ఆదివారం భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ ప‌ర్వేశ్ వ‌ర్మ(Parvesh Verma) కీల‌క ఆరోప‌ణ‌లు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ వివాదంలో కేసీఆర్ ను లాగారు.

తెలంగాణ‌లో కూడా ఇదే విధ‌మైన ఎక్సైజ్ పాల‌సీ ఉంద‌ని , ప‌శ్చిమ బెంగాల్ లో కూడా అమ‌లు చేశార‌ని ఆరోపించారు. సీఎం కేసీఆర్(CM KCR)  కుటుంబ స‌భ్యులు దేశ రాజ‌ధానిలోని ఫైవ్ స్టార్ హోట‌ల్ లో స‌మావేశాల‌కు హాజ‌రైన‌ట్లు మండిప‌డ్డారు.

ఆప్ , బీజేపీల మ‌ధ్య జ‌రుగుతున్న గొడ‌వ‌లో బీజేపీ ఎంపీ చేరారు. పంజాబ్ లో కేసీఆర్ కుటుంబీకులు అదే విధానాన్ని అమ‌లు చేశారు. మ‌నీష్ సిసోడియా, అర‌వింద్ కేజ్రీవాల్ తో క‌లిసి ఢిల్లీకి ప్ర‌ణాళిక సిద్దం చేశార‌ని సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు.

Also Read : మంత్రిని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించలేం – హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!