Priyanka Chaturvedi : అల్ ఖైదా బెదిరింపుల్ని ఖండించండి
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
Priyanka Chaturvedi : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భారత్ లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని అల్ ఖైదా హెచ్చరించింది. ప్రవక్త కోసం తమను తాము అర్పించు కునేందుకు, ప్రాణాలు కోల్పోయేందుకు సిద్దంగా ఉన్నామని అల్ ఖైదా పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో సూసైడ్ బాంబర్లు రెడీగా ఉన్నారంటూ పేర్కొనడంతో కేంద్ర సర్కార్ అలర్ట్ అయ్యింది.
అల్ ఖైదా భారత్ ను హెచ్చరించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు శివ సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. ప్రవక్త పై చేసిన కామెంట్స్ ను నిరసించిన పశ్చిమాసియా దేశాలు ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూప్ ల బెదిరింపులను బేషరత్తుగా ఖండించాలని ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) పిలుపునిచ్చారు.
ప్రస్తుత ప్రపంచంలో ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదన్నారు. మత పరమైన మనోభావాలకు గౌరవం, దాని ఆధారంగా బెదిరింపుల మధ్య వ్యత్యాసాన్ని నొక్కి చెప్పారు.
ఏ మతమూ కొంత మంది మాటలు వారి విశ్వాసాన్ని తగ్గించగలవన్నారు. ఏ మతమూ అంత దుర్బలమైనది కాదు. కొద్ది మంది చేసిన మాటలు వారి విశ్వాసాన్ని దిగజార్చ లేవని స్పష్టం చేశారు ప్రియాంక చతుర్వేది.
అల్ ఖైదా బెదిరింపు లేఖ రాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల హృదయాలు రక్తంతో ఉడికి పోతున్నాయంటూ అల్ ఖైదా స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఒకరు లేదా ఇద్దరు కామెంట్స్ చేసినంత మాత్రాన ఏ మతమూ దాని పవిత్రతను కోల్పోలేదని పేర్కొన్నారు.
Also Read : గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో ఎన్ హెచ్ 53