Sanjay Raut : ఎంపీ సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్
తలొగ్గడం కంటే తప్పుకోవడమే మేలు
Sanjay Raut : అధికారం శాశ్వతం కాదు. కొందరిపై ఆధారపడిన ఏ ప్రభుత్వమూ పూర్తి కాలం మనజాలదు. ఈ మాటలన్నిది ఎవరో కాదు ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ కేంద్రంపై నిప్పులు చెరుగుతూ వచ్చిన శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut).
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ లో బీజేపీతో బంధాన్ని కొనసాగించాలని శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్ నాథ్ షిండే ప్రతిపాదించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ సందర్భంగా తలొగ్గడం అన్నది శివసేన చరిత్ర లో లేదన్నారు. తల వంచడం కంటే తల తీసేందుకే తాము ఎక్కువగా ఇష్ట పడతామని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే మహారాష్ట్ర శాసనసభ రద్దు చేసే ఛాన్స్ ఉంది.
ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ కరోనా బారిన పడడంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఇదే సమయంలో మొత్తం 46 మంది ఎమ్మెల్యేలు తన వద్దే ఉన్నారంటూ ఏక్ నాథ్ ముండే ప్రకటించడంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది.
ఈ తరుణంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే సీఎంగా తప్పుకోనున్నారు. సంజయ్ రౌత్(Sanjay Raut) ఇంతకు ముందు తన పార్టీలో రాబోయే తిరుగుబాటు ముప్పును తగ్గించాడు.
కానీ పరిస్థితి చేయి దాటి పోయినట్లు కనిపిస్తోంది. దాంతో విధాన సభ రద్దు చేయడమే మేలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
రాజకీయ పరిణామాలు విధాన సభ రద్దు దిశగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
Also Read : ముదిరిన సంక్షోభం గౌహతికి చేరిన రాజకీయం