MP Sanjay Singh : మైనార్టీల పట్ల బీజేపీ వివక్ష
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
MP Sanjay Singh : కేంద్ర సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో కులాలు, మతాలు, వర్గాలు, విభేదాల పేరుతో ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంస్థలు రాజకీయాలు చేస్తున్నాయంటూ నిప్పులు చెరిగారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రధానంగా దేశంలో ఉన్న మైనార్టీలను ఎగతాళి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలలో అశాంతి నెలకొందని దానిని రూపు మాపేందుకు చర్యలు చేపట్టాల్సిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు ఎంపీ సంజయ్ సింగ్(MP Sanjay Singh). పంజాబ్ లో లా అండ్ ఆర్డర్ లో ఆప్ సర్కార్ విఫలమైందని నిరాధార ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఢిల్లీలో తమ ఆధీనంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో చూడాలన్నారు. అది దేశ రాజధానిలో నివసిస్తున్న వారందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు ఎంపీ.
ఇక మణిపూర్ లో చోటు చేసుకున్న హింసకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు 10 వేల మంది సైనికులను మోహరించినా కంట్రోల్ కావడం లేదన్నారు. వేలాది మంది నిరాశ్రయులుగా మారినా ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదంటూ నిలదీశారు ఎంపీ సంజయ్ సింగ్. తమ వైపు చూసుకోకుండా ఎదుటి వాళ్లపై రాళ్లు వేయడం మాను కోవాలని హితవు పలికారు .
Also Read : Pawan Kalyan : బహుజనుల సంక్షేమం జనసేన లక్ష్యం