Sushil Kumar Modi : వైస్ ప్రెసిడెంట్ కావాల‌నుకున్నారు

సుశీల్ కుమార్ మోదీ షాకింగ్ కామెంట్స్

Sushil Kumar Modi : జేడీయూ, బీజేపీ పార్టీల మ‌ధ్య 17 ఏళ్ల బంధానికి చెక్ ప‌డింది. ఈ త‌రుణంలో భార‌తీయ జ‌నతా పార్టీ నితీశ్ కుమార్ పై నిప్పులు చెరుగుతోంది.

నితీశ్ కుమార్ ను ఉపాధ్య‌క్షుడిని చేయండంటూ ఆ పార్టీ ఆఫ‌ర్ చేసింద‌న్నారు బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ(Sushil Kumar Modi). ఉప రాష్ట్ర‌ప‌తి హోదాలో నితీశ్ కుమార్ ఢిల్లీకి వెళితే బీహార్ సీఎం కావ‌చ్చ‌ని కొంద‌రు జేడీయూ త‌న‌ను సంప్ర‌దించార‌ని బాంబు పేల్చారు.

బుధ‌వారం సుశీల్ కుమార్ మోదీ మీడియాతో మాట్లాడారు. మోదీ చేసిన కామెంట్స్ పై ఇంకా జేడీయూ స్పందించ‌లేదు.

కొంత మంది జేడీయూ నాయ‌కులు నితీశ్ కుమార్ ను ఉప రాష్ట్ర‌ప‌తిని చేసి బీహార్ లో మీరే పాలించండి అని చెప్పేందుకు వ‌చ్చార‌న్నారు బీహార్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ముందు చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ కొలువు తీరిన వెంట‌నే నితీశ్ కుమార్ త‌న‌కు జాతీయ స్థాయిలో ప‌ద‌వి చేపట్టాల‌న్న ఆశ లేద‌న్నారు. నేను ఉంటానో లేదో ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని అన్నారు.

నేను ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని ఆశించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. 2014లో న‌రేంద్ర మోదీ ప్ర‌ధానిగా గెలిచి ఉండ‌వ‌చ్చు. కానీ రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 2024లో గెలుస్తారా అన్న‌దే అస‌లైన ప్ర‌శ్న‌.

ఈ సంద‌ర్భంగా గ‌త నెలన్న‌ర కాలంలో నేను మీడియాతో మాట్లాడ‌టం మానేశాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ధాని మోదీని, త‌మ ఉమ్మ‌డి కూట‌మికి ఓటు వేసిన బీహార్ ప్ర‌జ‌ల‌ను నితీశ్ కుమార్ అవ‌మానించారంటూ సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు.

Also Read : మోదీ 2014లో గెలిచారు 2024లో గెలుస్తారా

Leave A Reply

Your Email Id will not be published!