MP Vijaysai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్ మహారత్న’ అవార్డు !
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్ మహారత్న’ అవార్డు !
MP Vijaysai Reddy: వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం లభించింది. రాజ్యసభ చర్చల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి పనితీరుకు మెచ్చి… ఏటా బెస్ట్ పార్లమెంటేరియన్లకు ఇచ్చే ‘సంసద్ మహారత్న’ అవార్డును ప్రకటించారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సధన్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ చేతుల మీదుగా శనివారం ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా విజయసాయిరెడ్డి అత్యుత్తమ పనితీరుకు గాను అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్‌తో కలిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ ఆహిర్ మాట్లాడుతూ… పార్లమెంట్ లో వివిధ పద్దతుల్లో ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపేందుకు ఎంపీలు నిరంతరం ప్రశ్నించాలి అని పిలుపునిచ్చారు.
MP Vijaysai Reddy Got Award
సంసద్ రత్న అవార్డ్స్ – 2024… 14వ ఎడిషన్‌లో ప్రతిష్టాత్మకమైన సంసద్ మహా రత్న అవార్డును అందుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవంగా భావిస్తున్నట్లు విజయసాయి రెడ్డి(Vijaysai Reddy) ట్వీట్ చేశారు. రవాణా, పర్యాటకం, సంస్కృతిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ద్వారా తన సహకారానికి గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు 17వ లోక్ సభ కాలంలో తన అంకితభావానికి, ప్రభావానికి నిదర్శనమన్నారు. సంసద్ రత్న, సంసద్ మహారత్న, సంసద్ ఉత్కృష్ట మహారత్న అవార్డులు అందుకున్న వారిలో ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, భతృహరి మహాతా, సుప్రియా సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హా, గద్ది గౌడ, సుధీర్ గుప్తా, అమోల్ రాంసింగ్ కొల్హే, రాజ్ శర్మ ఉన్నారు.
Also Read : ISRO Launches GSLV-F14: విజయవంతమైన ‘జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14’ ప్రయోగం !