MS Dhoni : ఐపీఎల్ క‌ప్ పై క‌న్నేసిన ధోనీ

స‌మిష్టి విజ‌యానికి సంకేతం

MS Dhoni : ఐపీఎల్ 16వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. వ‌రుస విజ‌యాల‌తో దుమ్ము రేపుతూ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతూ వ‌చ్చిన హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది.

చెన్నై వేదిక‌గా క్వాలిఫ‌య‌ర్ -1 మ్యాచ్ నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగింది. మొద‌ట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ర‌న్స్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 7 ఫోర్లు 1 సిక్స‌ర్ తో రెచ్చి పోయాడు. 44 బంతుల్లో 60 ర‌న్స్ చేశాడు. అత‌డికి తోడుగా డేవాన్ కాన్వే 40 ప‌రుగులు చేశాడు. వీరితో పాటు అజింక్యా ర‌హానే , అంబటి రాయుడు వేగంగా 17 ప‌రుగుల చొప్పున చేశారు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ టాప్ బ్యాట‌ర్లు చెన్నై బౌల‌ర్ల ధాటికి కుప్ప కూలారు. పెవిలియ‌న్ బాట పట్టారు. ఆఫ్గ‌నిస్తాన్ స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్ ఒక్క‌డే దుమ్ము రేపాడు. గెలుపు ఆశలు పెంచాడు. కానీ చివ‌ర‌లో దేశ్ పాండే దెబ్బ‌కు వికెట్ పారేసుకున్నాడు. దీంతో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

15 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. ఈ సంద‌ర్భంగా మ్యాచ్ అనంత‌రం సీఎస్కే ధోనీ(Dhoni) హ‌ర్ష బోగ్లేతో మాట్లాడాడు. తామంతా క‌లిసిక‌ట్టుగా ఆడామ‌న్నాడు. ఇక మిగిలింది ఐపీఎల్ క‌ప్ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశాడు.

Also Read : Devon Conway

 

Leave A Reply

Your Email Id will not be published!