Devon Conway : స‌త్తా చాటిన డెవాన్ కాన్వే

గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్

Devon Conway : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో ధోనీ సేన దుమ్ము రేపింది. 15 ర‌న్స్ తేడాతో ప్ర‌త్య‌ర్థి గుజ‌రాత్ టైటాన్స్ పై గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 172 ర‌న్స్ చేసింది. ఓ వైపు రుతురాజ్ గైక్వాడ్ స‌హ‌జ సిద్ద‌మైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. గ‌తంలో ఆడిన మ్యాచ్ ల‌లో అంత‌గా రాణించ‌ని ఈ ఓపెన‌ర్ ఉన్న‌ట్టుండి జూలు విదిల్చాడు.

44 బంతులు ఆడి 7 ఫోర్లు 1 సిక్స‌ర్ తో 60 రన్స్ చేశాడు. మ‌రో ఓపెన‌ర్ డేవాన్ కాన్వే(Devon Conway) 34 బంతుల్లో 4 ఫోర్ల‌తో 40 ర‌న్స్ చేశాడు. స్కోర్ పెరిగేందుకు దోహ‌ద ప‌డ్డాడు. ఇక అజింక్యా వేగంగా ర‌హానే 10 బంతుల్లో 17 ప‌రుగుల‌తో రాణించ‌గా అంబ‌టి రాయుడు 9 బంతుల్లో 17 ర‌న్స్ చేశాడు. దీంతో చెన్నై సూప‌ర్ కింగ్స్ గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోర్ చేసింది.

అనంత‌రం 173 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో గుజ‌రాత్ టైటాన్స్ చేతులెత్తేసింది. 20 ఓవ‌ర్ల‌లో 157 ప‌రుగుల‌కు ఆలౌటైంది. చెన్నై బౌల‌ర్ల ధాటికి వికెట్లు ట‌పా ట‌పా రాలాయి. డాసున్ శ‌న‌క 17 ర‌న్స్ చేస్తే సాహా 12 , విజ‌య్ శంక‌ర్ 14, హార్దిక్ పాండ్యా 8 , డేవిడ్ మిల్ల‌ర్ 4, రాహుల్ తెవాటియా 3 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు.

ఈ త‌రుణంలో ఆఫ్గ‌నిస్తాన్ స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్ ఒక్క‌డే ఒంట‌రి పోరాటం చేశాడు. 16 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 30 ప‌రుగులు చేశాడు. కానీ లాభం లేక పోయింది . దేశ్ పాండే వేసిన బంతికి బౌల్డ్ కావ‌డంతో చెన్నై గెలుపు బాట ప‌ట్టింది.

Also Read : Ruthuraj Gaikwad

Leave A Reply

Your Email Id will not be published!