MS Dhoni : మెరిసిన మ‌హేంద్ర సింగ్ ధోనీ

9 బంతులు 1 ఫోర్ 2 సిక్స‌ర్లు

ఊహించ‌ని రీతిలో ఐపీఎల్ 16వ సీజ‌న్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స‌త్తా చాటింది. ప్రారంభంలో ఆశించిన మేర రాణించ‌క పోయినా ఆ త‌ర్వాత పుంజుకుంది. దిగ్గ‌జ జ‌ట్ల‌కు ఝ‌ల‌క్ ఇస్తూ ముందుకు సాగుతోంది. అంతే కాదు పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ 3 లోకి చేరింది. మ‌రోసారి ఫినిషింగ్ ట‌చ్ ఎలా ఉంటుందో చూపించాడు జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ.

లీగ్ మ్యాచ్ లో భాగంగా చెన్నైలో ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్ లో 27 ప‌రుగుల తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై గెలుపొందింది. ముందుగా చెన్నై సూప‌ర్ కింగ్స్ స్కిప్ప‌ర్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఆశించిన మేర రాణించ లేక పోయారు బ్యాట‌ర్లు. ఓ వైపు వికెట్లు కోల్పోయి తక్కువ ప‌రుగులు చేసిన చెన్నైకి స్కోర్ పెంచ‌డంలో స‌హాయ ప‌డ్డాడు ఎంఎస్ ధోనీ. తాను సిస‌లైన కెప్టెన్ అని నిరూపించాడు.

చివ‌ర‌లో వ‌చ్చాడు జార్ఖండ్ డైన‌మెంట్. ఖ‌లీల్ అహ్మ‌ద్ కు చుక్క‌లు చూపించాడు. కేవ‌లం 9 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఇందులో 1 ఫోర్ 2 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. 20 కీల‌క‌మైన ప‌రుగులు చేశాడు. ధోనీ చేసిన ఆ ర‌న్స్ కీల‌కంగా మారాయి చెన్నై సూప‌ర్ కింగ్స్ కు.

Leave A Reply

Your Email Id will not be published!