MSK Prasad : భారత క్రికెట్ జట్టు మాజీ చీఫ్ సెలక్టర్ , ప్రస్తుత క్రికెట్ కామెంటేటర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ -19 వరల్డ్ కప్ లో భారత జట్టు ఇంగ్లండ్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది.
ఈ మొత్తం లీగ్ లో ఆంధ్రాకు చెందిన ప్లేయర్ షేక్ రషీద్ అద్భుతంగా ఆడాడు. కీలక పాత్ర పోషించాడు. ఈ తరుణంలో షేక్ రషీద్ ఆట తీరుపై ఇవాళ ఎమ్మెస్కే ప్రసాద్ (MSK Prasad)స్పందించాడు.
రాబోయే రోజుల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని ఆశా భావం వ్యక్తం చేశాడు. ఇప్పటి నుంచి గనుక ఆటపై మరింత ఫోకస్ పెట్టగలిగితే రషీద్ టీమిండియాలో మూడో ప్లేస్ లో రాగలడని పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి. కుడి చేతి బ్యాటర్ గా షేక్ రషీద్ రాణిస్తాడన్నాడు ప్రసాద్(MSK Prasad). రషీద్ తో పాటు యశ్ ధుల్, రఘు వంశీ, రాజ్ బావా, రాజ్ వర్దన్ , విక్కీ, రవి కుమార్ లు అద్భుతంగా రాణించాడన్నాడు.
అయితే యశ్ ధుల్ తో పాటు రషీద్ కు సూపర్ ఫ్యూచర్ ఉంటుందన్నాడు ఎమ్మెస్కే ప్రసాద్. మూడు ఫార్మాట్ లలో ఆడగలడని నమ్మకం తనకు ఉందన్నాడు.
17 ఏళ్ల వయసు కలిగిన షేక్ రషీద్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ లో 94 పరుగులతో విరుచుకు పడ్డాడు. ఫైనల్ లో చక్కటి హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడని తెలిపాడు.
బ్యాటింగ్ టెక్నిక్ బాగుందన్నాడు. ఎక్కడా తడబాటు పడకుండా ఆడే స్వభావాన్ని కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు.
Also Read : లతా స్వరం దైవ స్వరూపం – రమీజ్ రజా