Mubashir Azad : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. సీనియర్లు ఒకరిని విడిచి మరొకరు పార్టీని వీడుతున్నారు. ఇంకొందరు హైకమాండ్ పనితీరును ప్రశ్నిస్తున్నారు.
ఈ తరుణంలో తాజాగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు, మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఇవాళ కాంగ్రెస్ కు రాం రాం చెప్పారు. ఇవాళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ఇతర పార్టీ ముఖ్య నేతల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే దేశంలోని ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పార్టీని వీడడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ములాశిర్ ఆజాద్ (Mubashir Azad)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిన ఘనమైన చరిత్ర గులాం నబీ ఆజాద్ దేనని పేర్కొన్నారు.
అయితే ఎంతో అనుభవం కలిగిన ఆయనను అగౌరవ పర్చడం తమను, పార్టీ శ్రేణులు, నాయకులను బాధకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు .
విచిత్రం ఏమిటంటే దేశానికి ఎనలేని సేవలు అందించిన గులాం నబీ ఆజాద్ ను పార్లమెంట్ సాక్షిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారని తెలిపారు.
కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తిగా పక్కన పెట్టడం దారుణమని ఆరోపించారు. ప్రస్తుతం పార్టీ అంతర్గత కుమ్ములాటలతో కూరుకు పోయిందని ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వం కు మెచ్చి తాను పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Also Read : దాడికి గురి కాని దేశం ఇండియానే