Mukesh Ambani : ఆసియా కుబేరుడిగా మళ్లీ అంబానీ
అదానీని నెట్టేసిన బిజినెస్ టైకూన్
Mukesh Ambani : నిన్నటి దాకా ఆసియా కుబేరుడిగా ఉన్న అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీకి షాక్ ఇచ్చారు రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ. ఆయన మళ్లీ తన స్థానాన్ని చేరుకున్నాడు.
తాజాగా అందిన సమాచారం మేరకు ఆసియా ఖండంలో అత్యంత ధనవంతుడు ( కుబేరుడు) గా నిలిచాడు ముఖేష్ అంబానీ(Mukesh Ambani). ఈ
మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ముఖేష్ అంబానీ భారత దేశంతో పాటు ఆసియాలో సైతం అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని పొందారు.
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ముఖేష్ అంబానీ నికర ఆస్తుల విలువ 99.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా గౌతమ్ అదానీ నికర ఆస్తుల విలువ 98.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇద్దరి మధ్య కొద్ది తేడా వ్యత్యాసం ఉంది. ముఖేష్ అంబానీ ప్రపంచంలోని ఎనిమిదో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. భారత్ తో పాటు ఆసియా లోనూ ఆర్ఐఎల్ చైర్మన్ టాప్ లో నిలిచారు.
ఇటీవల ఆయనను దాటేశారు అదానీ. కాగా గ్లోబల్ బిలియనీర్ లిస్టులో అంబానీ తర్వాత గౌతమ్ అదానీ ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ లో అదానీ తొమ్మిదో స్థానంలో నిలిచారు.
కాగా ఆర్ఐఎల్ షేర్లలో పెరుగుదుల ముఖేష్ అంబానీ(Mukesh Ambani) సంపదను పెంచేందుకు దారి తీసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆర్ఐఎల్ షేర్లు 16 శాతానికి పైగా పెరిగాయి. ఈ వారంలో 6.79 శాతం లాభ పడింది.
Also Read : ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ షాక్