Forbes India 2021 : కుబేరుల్లో ముకేశ్ అంబానీ టాప్

రెండో ప్లేస్ ద‌క్కించుకున్న అదానీ

Forbes India 2021  : రోజు రోజుకు ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌తీయ వ్యాపార‌వేత్త‌లు దుమ్ము రేపుతున్నారు. సంప‌ద‌, ఆదాయంతో దూసుకు పోతున్నారు. వ్యాపార రంగాల‌లో త‌మ‌దైన ముద్ర వేస్తున్నారు.

ఇక భార‌త దేశానికి చెందిన ధ‌న‌వంతులలో టాప్ ఎవ‌ర‌నే దానిపై ఫోర్బ్స్ జాబితా(Forbes India 2021 )ప్ర‌క‌టించింది. ఇండియాలో అత్యంత సంప‌న్నుడిగా రిల‌య‌న్స్ గ్రూప్ చైర్మ‌న్ ముకేశ్ అంబానీ టాప్ లో నిలిచారు.

ఆయ‌న వ‌ర‌ల్డ్ వైడ్ గా 10వ స్థానంలో నిలిచారు. ఇక మ‌రో భార‌తీయ వ్యాపార దిగ్గ‌జం అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీ రెండో ప్లేస్ ద‌క్కించుకున్నారు. ఇక అంబానీ (Forbes India 2021 )వ్య‌క్తిగ‌త సంప‌ద చూస్తే 90.7 బిలియ‌న్ డాల‌ర్లు.

ఇక అదానీ సంప‌ద 90 బిలియ‌న్ డాల‌ర్లు. ఇద్ద‌రి మ‌ధ్య 7 శాతం తేడా ఉంది. ఇక ఇదే భార‌త్ కు చెందిన హెచ్ సీ ఎల్ చైర్మ‌న్ శివ్ నాడ‌ర్ సంప‌ద 28. 7 బిలియ‌న్ డాల‌ర్లతో మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు.

ఈ ముగ్గురు గ‌త ఏడాది ప్ర‌క‌టించిన లిస్టులో నిల‌వ‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది ఆర్థిక సంవ‌త్స‌రంతో పోలిస్తే ముకేశ్ విలువ అమాంతం పెరిగింది.

వ‌ర‌ల్డ్ లో ముడి చ‌మురు రిఫైన‌రీ కాంప్లెక్స్ తో పాటు దేశ వ్యాప్తంగా 4జీ నెట్ వ‌ర్క్ తో జియో, ఇత‌ర రంగాల‌లో విస్త‌రించింది రిల‌య‌న్స్ గ్రూప్.

ఇక అదానీ ప‌రంగా చూస్తే మ‌నోడు నౌకాశ్ర‌యాలు, ఎయిర్ పోర్టులు, థ‌ర్మ‌ల్ విద్యుత్ , బొగ్గు రంగాల్లో విస్త‌రించి ఉంది. ఇక ఈసారి క‌రోనా పుణ్య‌మా అని కోవీషీల్డ్ కంపెనీ చైర్మ‌న్ పూనావాలా 4వ స్థానం పొందాడు.

ఆయ‌న వ్య‌క్తిగ‌త సంప‌ద 24.3 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ఇక డి మార్ట్ ఫౌండ‌ర్ రాధాకృష్ణ ద‌మానీ ఐదో స్థానంలో నిల‌వ‌డం విశేషం.

Also Read : జియో ఇనిస్టిట్యూట్ హెడ్ గా ‘గురుస్వామి’

Leave A Reply

Your Email Id will not be published!