UP CM Yogi Mulayam : ములాయం సోషలిజం మూల స్తంభం – యోగి
ములాయం మరణం బాధాకరం
UP CM Yogi Mulayam : ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల దేశ వ్యాప్తంగా సంతాపం వ్యక్తం అవుతోంది. ప్రధానమంత్రితో పాటు పలువురు రాజకీయ నాయకులు, కీలక రంగాలకు చెందిన వారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తాజాగా యుపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM Yogi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆయన మరణం బాధాకరమని పేర్కొన్నారు. సోషలిజం మూల స్తంభం ములాయం సింగ్ యాదవ్ అంటూ కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు సీఎం. ఈ మేరకు ములాయం సింగ్ యాదవ్ మృతికి సంతాప సూచకంగా రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు యోగి ఆదిత్యానాథ్.
దేశం గర్వించ దగిన సోషలిస్టు నాయకుడు ములాయం సింగ్ యాదవ్ అంటూ పేర్కొన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ , సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ తో కూడా సీఎం ఫోన్ లో సంతాపాన్ని తెలియ చేశారని బీజేపీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
పార్టీలు వేరైనా రాజకీయ భావజాలం వేరైనా ములాయం సింగ్ యాదవ్ చివరి వరకు సోషలిస్టు నాయకుడిగానే ఉన్నారని, బతికారంటూ కితాబు ఇచ్చారు సీఎం యోగి ఆదిత్యా నాథ్. తనకు వ్యక్తిగతంగా తెలిసిన నాయకుడని పేర్కొన్నారు. ఆయన సోషలిజంకు మూల స్తంభంగా నిలిచాడు.
అతడి మరణం పోరాట యుగానికి ముగింపు అంటూ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియ చేశారు యోగి ఆదిత్యానాథ్.
Also Read : రాజకీయ రంగంపై చెరగని ముద్ర